News October 17, 2024
తొలి టెస్ట్: 134 పరుగుల ఆధిక్యంలో NZ

బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 46 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన NZ రెండో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కాన్వే(91), యంగ్(33) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, అశ్విన్, జడేజా తలో వికెట్ తీశారు.
Similar News
News January 30, 2026
కుప్పంలో CM పర్యటనకు సర్వం సిద్ధం

CM చంద్రబాబు 3 రోజులు కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో పర్యటించనున్నారు. CM పర్యటన కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం గుంటూరు పర్యటన ముగించుకుని హెలికాప్టర్లో గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొనున్నారు. అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రారంభిస్తారని అధికారికంగా సమాచారం వెలువడింది.
News January 30, 2026
భూమి బయట సముద్రం ఉంటుందా?

భూమ్మీద సముద్రాలుంటాయి. మరి హిరణ్యాక్షుడు భూమిని సంద్రంలో ఎలా దాచాడు? ఈ సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం.. ఈ విశ్వంలో సగం వరకు ‘గర్భోదక జలాలు’ ఉంటాయి. ఇందులో అనంతమైన నీరు ఉంటుంది. హిరణ్యాక్షుడు భూమిని ఈ విశ్వ జలరాశి అడుగునే పడేశాడు. ఓ నీటి గిన్నెలో బంతి మునిగినట్లుగా, భూగోళం ఆ సంద్రంలో మునిగింది. అప్పుడు భగవంతుడు వరాహ రూపంలో ఆ జలాల లోపలికి వెళ్లి, భూమిని రక్షించాడు.
News January 30, 2026
భూమిని కాపాడేందుకు వరాహ రూపమే ఎందుకు? (1/2)

గ్రహాలన్నీ ఓ నియమ కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే హిరణ్యాక్షుడు భూకక్ష్యకు విఘాతం కలిగించడంతో అది విశ్వ గర్భోదక జలాల్లో మునిగిపోయింది. నీటి అడుగున ఉన్న భూమిని రక్షించి, తిరిగి అదే స్థానంలో నిలపడానికి జలచర సామర్థ్యం గల వరాహ రూపం అనువైనది. అందుకే విష్ణువు ఆ అవతారమెత్తాడు. తన కొమ్ముదంతంతో భూమిని ఉద్ధరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించాడు. ఇది కేవలం లీల మాత్రమే కాదు. సృష్టి సమతుల్యతను కాపాడే దివ్య చర్య.


