News October 17, 2024

‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది: కంగన

image

తన సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని నటి కంగనా రనౌత్ వెల్లడించారు. సర్టిఫికేట్ రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. అభిమానులు సహనంతో ఉండి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇందులో ఇందిరా గాంధీని, ఒక వర్గం ప్రజలను తప్పుగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.

Similar News

News October 18, 2024

ఆంజనేయస్వామి ఆలయ కూల్చివేతలో ట్విస్ట్

image

AP: చిత్తూరు(D) మొలకలచెరువులో ఈ నెల 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం <<14370148>>కూల్చివేత ఘటనలో<<>> ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య పోరు తలెత్తింది. ఈ క్రమంలో హరినాథ్ గుడిని ధ్వంసం చేశాడని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

News October 17, 2024

ఆసీస్‌కు షాక్.. ఫైనల్‌కు సౌతాఫ్రికా

image

మహిళల T20 WCలో ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా జట్టు షాకిచ్చింది. 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఓడిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 134/5 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 17.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 రన్స్ చేసింది. చివరి మూడు టీ20 వరల్డ్ కప్‌ టోర్నీల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

News October 17, 2024

గ్రూప్-1 మెయిన్స్ వాయిదా లేనట్లేనా?

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ప్రెస్ మీట్‌లో వాయిదా విషయమై అడిగిన ప్రశ్నకు ఇది సందర్భం కాదని సీఎం దాటవేశారు. మరోవైపు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో వాయిదా పడే అవకాశం లేదని కొందరు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.