News October 17, 2024
46 పరుగులకు ఆలౌట్.. కెప్టెన్ రోహిత్ ఏమన్నారంటే?

న్యూజిలాండ్‌తో టెస్టులో తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిచ్‌ను తానే తప్పుగా అంచనా వేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని భావించానని, సరిగా అర్థం చేసుకోలేకపోయానన్నారు. మరోవైపు రాహుల్ స్థానాన్ని పదే పదే మార్చడం ఇష్టం లేకనే కోహ్లీని ఫస్ట్ డౌన్‌లో పంపినట్లు పేర్కొన్నారు. జట్టులో ప్లేయర్లు సామర్థ్యానికి తగినట్లుగా ఆడలేకపోయారన్నారు.
Similar News
News February 6, 2026
PHCలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు.
రోగులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
News February 6, 2026
తెలంగాణలో 336 వార్డుల్లో జనసేన పోటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో తమ పార్టీ పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ADB, నల్గొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొంది. ఇప్పటికే B-ఫారమ్స్ దాఖలు చేయగా, రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారని తెలిపింది. వీరంతా గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు వివరించింది.
News February 6, 2026
క్లాడ్ 4.6 ఓపస్: పనులన్నీ చిటికెలో.. IT ఉద్యోగుల ఆందోళన ఇదే..

ఆంథ్రోపిక్ కొత్తగా రిలీజ్ చేసిన Claude Opus 4.6 మోడల్ ప్రొఫెషనల్ పనుల కోసం డిజైన్ చేశారు. ఇది కాంప్లెక్స్ కోడింగ్‌ను సెకన్లలో డీబగ్ చేస్తుంది. భారీ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. వేల పేజీల డాక్యుమెంట్లను సెకన్లలో రీసెర్చ్ చేస్తుంది. ఫైనాన్షియల్ అనాలసిస్, ఎక్సెల్ షీట్లు, ప్రజెంటేషన్లను తయారు చేయడంలో ఇది దిట్ట. దీని రాకతో IT రంగంలో జాబ్స్ పోతాయంటూ <<19066930>>ఆందోళన<<>> వ్యక్తమవుతోంది.


