News October 17, 2024

కమలా హారిస్‌కు చైనా మద్దతు

image

అమెరికా అధ్యక్ష పదవికి కమలా హారిస్ ఎన్నికవ్వాలని కోరుకుంటున్నట్లు చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్(CPPCC) సభ్యుడు జియా కింగువో పేర్కొన్నారు. చైనా సర్కారులో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంటుంది. ‘మాకు ట్రంప్‌తో చేదు అనుభవాలున్నాయి. వాటిని మళ్లీ ఎదుర్కోవాలనుకోవడం లేదు. హారిస్ గెలిస్తేనే బెటర్. బైడెన్‌ పాలనలోనూ ఇబ్బందులున్నా, అమెరికా విధానాలు స్థిరంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

Similar News

News October 18, 2024

ఈరోజు ఈ ఏడాదిలోనే అతి పెద్ద చంద్ర దర్శనం!

image

ఈ ఏడాదిలోనే అతి పెద్ద చంద్రుడు ఆకాశంలో శుక్రవారం తెల్లవారుజామున దర్శనమివ్వనున్నాడు. ఈ చంద్రబింబాన్ని ‘హంటర్స్ మూన్’ లేదా సూపర్ మూన్‌గా చెబుతారు. తెల్లవారుజాము 4.30 గంటలకు చంద్రుడు సాధారణంకంటే 14శాతం పెద్దగా, 30శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడని ఖగోళ పరిశోధకులు తెలిపారు. ఈ ఏడాది సూపర్‌మూన్స్‌లో ఇది రెండోది కావడం గమనార్హం.

News October 18, 2024

ఈ నెల 21న దక్షిణ కొరియాకు మంత్రులు, ఎమ్మెల్యేలు

image

TG: మూసీ పునరుజ్జీవం కోసం అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్‌లో పర్యటిస్తారు. స్థానికంగా రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.

News October 18, 2024

భారత్ టాస్ మాత్రమే గెలిచి అంతా ఓడింది: అజయ్ జడేజా

image

న్యూజిలాండ్‌తో టెస్టులో భారత్ ఆడిన విధానంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు గుప్పించారు. మ్యాచ్‌లో టాస్ గెలవడం ఒకటే భారత్ చేసిన మంచి పని అని తేల్చిచెప్పారు. ‘రెండో రోజు టాస్ తప్ప మిగిలిన ఆటంతా భారత్ ఓడింది. బౌలింగ్‌పరంగా ఫర్వాలేదనిపించారు కానీ బ్యాటింగ్ నిర్లక్ష్యంగా, ఫీల్డింగ్ నీరసంగా కనిపించింది. బ్యాటర్లు వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు’ అని విమర్శించారు.