News October 17, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

☆ రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: జిల్లా ఎస్పీ☆ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన BJP ఎంపీ ఈటెల☆ కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి తుమ్మల తనయుడు☆ కుటీర పరిశ్రమతో ఉపాధి కల్పించడం సంతోషకరం: ITDA PO☆ జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి, కొమరం బీమ్ వర్ధంతి కార్యక్రమం☆ ఖమ్మం మున్నేరు పాత వంతెన పై రాకపోకలు దారి మళ్లింపు☆ బయ్యారంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
Similar News
News January 1, 2026
టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS : సీపీ

JAN 3 నుండి 20 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే టీజీ టెట్ పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అటు సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
News January 1, 2026
అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం

ఖమ్మం నగరంలోని అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడిగా బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారుగా పల్లెబోయిన చంద్రయ్య, దండా జ్యోతి రెడ్డి, అధ్యక్షుడిగా అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బెల్లి కొండల్ రావు, కోశాధికారిగా పల్లపు సత్యంతో పాటు ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, వీరబాబు, మణికంఠ, వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.
News January 1, 2026
ఖమ్మం: ఐదేళ్లుగా అసంపూర్తిగానే అగ్రహారం అండర్ బ్రిడ్జి!

ఖమ్మం-బోనకల్ రహదారిలోని అగ్రహారం వద్ద రూ.18.50 కోట్లతో చేపట్టిన అండర్ బ్రిడ్జి (RUB) పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 2021లో శంకుస్థాపన చేసినా, కోవిడ్, విజయవాడ-కాజీపేట మూడో రైల్వే లైన్ అలైన్‌మెంట్ మార్పు వల్ల పనులు నిలిచిపోయాయి. దీనివల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


