News October 17, 2024

సూపర్ మార్కెట్‌లో ధరలపై మంత్రి ఆగ్రహం

image

AP: మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని రైతు బజార్, సూపర్ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయల ధరలు, స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. సూపర్ మార్కెట్‌లో కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమ ప్రభుత్వం రాయితీపై రేషన్ షాపుల్లో ఉల్లి, టమాటా, కందిపప్పు, నూనె అందిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 18, 2024

భారత్ 46కే ఆలౌట్: రహానే ట్వీట్ వైరల్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. అదే సమయంలో భారత క్రికెటర్ అజింక్య రహానే పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘స్ట్రైకింగ్ చేయడానికి నేను సిద్ధం’ అంటూ ఆయన గ్రీన్ టిక్ బాక్సులో రైట్ గుర్తు ఉన్న ఎమోజీ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్’, ఎప్పుడు ఏది పోస్ట్ చేయాలో నీకు బాగా తెలుసు’ అంటున్నారు.

News October 18, 2024

నేను చేయలేనని బతిమిలాడాను: సమంత

image

మయోసైటిస్‌తో బాధపడిన సమయంలో ‘సిటాడెల్ హనీబనీ’లో నటించడం తన వల్ల కాలేదని హీరోయిన్ సమంత తెలిపారు. ‘నావల్ల కాదని, నేను చేయలేనని నిర్మాతలను వేడుకున్నాను. నా ప్లేస్‌లో వేరేవాళ్లను తీసుకోవాలని సూచించాను. నలుగురి పేర్లను కూడా రికమెండ్ చేశాను’ అని మూవీ ప్రమోషన్ల సందర్భంగా చెప్పారు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సిరీస్ చేసేందుకు అవసరమైన శక్తిని తాను సంపాదించానని సామ్ వెల్లడించారు.

News October 18, 2024

‘సూర్య 44’ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కాదు: కార్తీక్ సుబ్బరాజు

image

సూర్య ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య 44’ చిత్రీకరణ ఇటీవల పూర్తి చేసుకుంది. అయితే ఇది గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కాదని, యాక్షన్-లవ్ చిత్రమని దర్శకుడు చెప్పారు. ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’, ‘మహాన్’ మూవీల బేసిక్ ఐడియాను రజినీకాంత్‌తో పంచుకున్నానని తర్వాత వేరే హీరోలతో రూపొందించినట్లు తెలిపారు. ఈ సినిమాలు విడుదలయ్యాక పూర్తి కథలు తనకెందుకు చెప్పలేదని రజినీ అడిగినట్లు గుర్తు చేశారు.