News October 18, 2024
భారత్ టాస్ మాత్రమే గెలిచి అంతా ఓడింది: అజయ్ జడేజా

న్యూజిలాండ్‌తో టెస్టులో భారత్ ఆడిన విధానంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు గుప్పించారు. మ్యాచ్‌లో టాస్ గెలవడం ఒకటే భారత్ చేసిన మంచి పని అని తేల్చిచెప్పారు. ‘రెండో రోజు టాస్ తప్ప మిగిలిన ఆటంతా భారత్ ఓడింది. బౌలింగ్‌పరంగా ఫర్వాలేదనిపించారు కానీ బ్యాటింగ్ నిర్లక్ష్యంగా, ఫీల్డింగ్ నీరసంగా కనిపించింది. బ్యాటర్లు వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు’ అని విమర్శించారు.
Similar News
News January 10, 2026
వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దరఖాస్తు ఎలా?

రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (AEO) లేదా వ్యవసాయాధికారిని సంప్రదించి దరఖాస్తు తీసుకొని, తమకు కావలసిన యంత్రం వివరాలను నింపి ఇవ్వాలి. దానిని వారు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. MRO, MPDO, AOలతో కూడిన ‘మండల స్థాయి కమిటీ’ అర్జీలను పరిశీలించి జిల్లా అధికారులకు పంపుతుంది. వారి ఆమోదం తర్వాత, యంత్రాలిచ్చే కంపెనీ పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
News January 10, 2026
శని దోష నివారణ మంత్రాలు

జాతకంలో శని దోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి ‘ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని, శని ధ్యాన శ్లోకాలను 19 వేల సార్లు పఠించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు. శని శాంతి మంత్రం, శని పత్ని నామ స్తుతి, శని చాలీసా చదివినా విశేష ఫలితాలుంటాయని సూచిస్తున్నారు. శనివారం నాడు ఈ మంత్రాలను స్మరిస్తే శని బాధలు క్షీణిస్తాయని నమ్మకం.
News January 10, 2026
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు

TG: వాహనాలను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసే వారి లైసెన్సులను రవాణాశాఖ 6 నెలల పాటు రద్దు చేస్తోంది. 2025లో 16వేలకు పైగా లైసెన్సులు రద్దయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్/రాంగ్ రూట్‌లో వెళ్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. రవాణాశాఖ నోటీసులిస్తుంది. వాహనదారుడి వివరణ సంతృప్తికరంగా లేకపోతే లైసెన్స్‌ను రద్దు చేస్తుంది. వారిపై మళ్లీ కేసులు నమోదైతే సస్పెన్షన్‌ను మరో 6 నెలలు లేదా ఏడాదిపాటు పొడిగిస్తారు.


