News October 18, 2024

ఈ నెల 21న దక్షిణ కొరియాకు మంత్రులు, ఎమ్మెల్యేలు

image

TG: మూసీ పునరుజ్జీవం కోసం అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్‌లో పర్యటిస్తారు. స్థానికంగా రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.

Similar News

News October 18, 2024

నన్ను క్యూటీ అంటావా..? జెప్టోపై యువతి ఆగ్రహం

image

జెప్టో యాప్ తనను ‘క్యూటీ’గా సంబోధిస్తూ పుష్ నోటిఫికేషన్ పంపించడంపై బెంగళూరుకు చెందిన మహక్ అనే యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళలపై అక్రమాలను ప్రశ్నించే యుగంలో ఉన్నాం మనం. నేనెవరో తెలియకుండా అలా క్యూటీ అని పంపించడమేంటి? నేను షాకయ్యా’ అని లింక్డ్‌ ఇన్‌లో ఆమె మండిపడ్డారు. కొంతమంది ఆమెకు మద్దతునిస్తుండగా, మరికొంతమంది మాత్రం చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారంటూ ఆమెను విమర్శిస్తున్నారు.

News October 18, 2024

ఒంటరిగా మారుతోన్న భారత్?

image

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో భారత్ తన వైఖరి తేల్చిచెప్పలేకపోతోంది. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఖండిస్తున్నా, మన దేశం మాత్రం ఐక్యరాజ్యసమితిలో తన అభిప్రాయాన్ని చెప్పలేకపోతోంది. చివరకు నాటో దేశాలు కూడా పాలస్తీనా మారణహోమంపై ఇజ్రాయెల్‌ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో ఇండియా ఒంటరి అవుతున్నట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News October 18, 2024

అంటార్కిటికాలో మిస్టరీ తలుపు.. నిపుణులేమంటున్నారంటే..

image

అంటార్కిటికాలో ఓ మంచు కొండకు తలుపులా ఉన్న ఆకారం గూగుల్ మ్యాప్‌లో ఓ నెటిజన్‌కు కనిపించింది. అదేదో రహస్య ప్రాంతంలా ఉందంటూ అతడు రెడిట్‌లో పోస్ట్ పెట్టగా అది చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ వైరల్ కాగా, అమెరికాలోని న్యూకాజిల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ స్పష్టతనిచ్చారు. ‘చూసేందుకు తలుపులా ఉన్నప్పటికీ అది కొండ నుంచి పొడుచుకొచ్చిన రాతి భాగం కావొచ్చు. మంచు ఘనీభవించడంతో అలా కనిపిస్తోంది’ అని వివరించారు.