News October 18, 2024

రాత్రి పూట మహిళా అభ్యర్థుల అరెస్ట్ దుర్మార్గం: కేటీఆర్

image

TG: హైదరాబాద్ అశోక్ నగర్‌లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న గ్రూప్-1 మహిళా అభ్యర్థులను రాత్రి పూట అరెస్ట్ చేయడం దుర్మార్గమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాత్రి సమయంలో మహిళలను అరెస్ట్ చేయకూడదనే ఇంగితజ్ఞానం కూడా తెలియదా అని ఆయన నిలదీశారు. ‘అరెస్టైన అభ్యర్థులు వెంటనే విడుదలయ్యేలా DGP చర్యలు తీసుకోవాలి. TSPSCతో CS చర్చించి వారి సమస్యను పరిష్కరించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News November 8, 2025

సంకటహర గణపతి వ్రతం ఎలా చేయాలంటే..?

image

నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. గణపతి పూజ చేసి, ఎర్ర గుడ్డలో పసుపు, కుంకుమ, బియ్యం, ఖర్జూరం, వక్కలు, దక్షిణ వేసి ముడుపు కట్టి, కోరిక మనసులో అనుకొని 21 ప్రదక్షిణలు చేయాలి. ఉపవాసం, మౌనంగా ఉంటూ గణపతిని కొలవాలి. సాయంత్రం దీపాలు పెట్టాలి. ముడుపు బియ్యంతో బెల్లం పాయసం, ఉండ్రాళ్లతో నైవేద్యం పెట్టాలి. వ్రతానికి ముందు రోజు, తర్వాత రోజు కూడా మద్యమాంసాలు ముట్టొద్దు. మరుసటి రోజు హోమం చేస్తే శుభం.

News November 8, 2025

‘ఓట్ చోరీ’.. యువతి సెల్ఫీ దుమారం!

image

ఓట్ చోరీ జరుగుతోందని రాహుల్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి బలం చేకూర్చేలా ఓ లాయర్ సెల్ఫీ వైరలవుతోంది. పుణేకు చెందిన ఉర్మీ అనే లాయర్ బిహార్‌లో ఎన్నికల రోజు.. ‘Modi-Fied ఇండియా కోసం ఓటేశాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఫాలోవర్స్ ఆమె అకౌంట్‌ను పరిశీలించగా.. గతంలో ‘పుణే ఎన్నికల్లో ఓటేశాను’ అని మరో ఫొటో ఉంది. ఇలాగే ఓటేస్తున్నారు అని కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.

News November 8, 2025

వేధింపులకే మా కూతురు చనిపోయింది: పేరెంట్స్

image

రాజస్థాన్ జైపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 12 ఏళ్ల <<18177948>>అమైరా సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ‘నన్ను స్కూలుకు పంపకండని మా కూతురు ఏడాది క్రితమే బతిమాలింది. ఆ విషయం మేము టీచర్‌కి చెప్పాం. వాళ్లు పట్టించుకోలేదు. లైంగిక అర్థాలు వచ్చేలా ఏడిపించడం, వేధించడం వల్లే మా కూతురు చనిపోయింది. వాళ్లు సమాధానం చెప్పాలి’ అని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.