News October 18, 2024

భారత్ 46కే ఆలౌట్: రహానే ట్వీట్ వైరల్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. అదే సమయంలో భారత క్రికెటర్ అజింక్య రహానే పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘స్ట్రైకింగ్ చేయడానికి నేను సిద్ధం’ అంటూ ఆయన గ్రీన్ టిక్ బాక్సులో రైట్ గుర్తు ఉన్న ఎమోజీ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్’, ఎప్పుడు ఏది పోస్ట్ చేయాలో నీకు బాగా తెలుసు’ అంటున్నారు.

Similar News

News October 18, 2024

నేడు స్కూళ్లకు సెలవు ఉందా?

image

AP: వాయుగుండం వల్ల భారీ వర్షాలు కురవడంతో గత 3, 4 రోజులుగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నిన్న వాయుగుండం తీరం దాటడంతో అతిభారీ వర్షాల ముప్పు తగ్గిందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు యథావిధిగా నడవనున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News October 18, 2024

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. అలాగే రూ.1,000 ఆలస్య రుసుముతో నవంబర్ 20లోగా కట్టొచ్చని వెల్లడించింది. ఈ గడువు తర్వాత ఇక అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఇంటర్ ఎగ్జామ్స్ ప్రైవేట్‌గా రాసేవారు రూ.1,500తో వచ్చే నెల 30లోగా, రూ.500 పెనాల్టీతో నవంబర్ 30లోగా ఫీజు చెల్లించవచ్చు.

News October 18, 2024

టీవీ యాంకర్ టు మిస్ ఇండియా

image

ఫెమినా మిస్ ఇండియాగా నికిత పోర్వాల్ నిలిచారు. 24 ఏళ్ల నికిత MPలోని ఉజ్జయినిలో జన్మించారు. బరోడాలో పీజీ చదువుతున్నారు. కుటుంబానికి అండగా నిలిచేందుకు 18 ఏళ్లకే టీవీ యాంకర్‌గా పనిచేశారు. ఆమెకు భక్తి ఎక్కువ, జంతువులంటే అమితమైన ప్రేమ. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాశారు. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మూవీలో నటించాలనుందని నికిత తెలిపారు. త్వరలోనే ఆమెను సిల్వర్ స్క్రీన్‌పై చూసే అవకాశముంది.