News October 18, 2024

YAHYA SINWAR: రెండు దశాబ్దాలు జైల్లోనే

image

హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. కాగా సిన్వర్ 1962లో గాజాలోని ఖాన్ యూనిస్‌లో జన్మించారు. గాజా వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నవారిని హత్య చేసినందుకు సిన్వర్‌ను 1988లో అరెస్ట్ చేశారు. 2011 వరకు ఆయన ఇజ్రాయెల్ జైల్లోనే గడిపారు. ఆ తర్వాత బయటకు వచ్చి హమాస్‌లో వేగంగా ఎదిగారు. 2015లో అతడిని US ఉగ్రవాదిగా ప్రకటించింది. 2017లో హమాస్ చీఫ్‌గా ఎన్నికయ్యారు.

Similar News

News October 18, 2024

మధ్యాహ్న భోజనంలో మార్పులు!

image

AP: నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో క్వాలిటీ పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్‌తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేరుస్తారు.

News October 18, 2024

కెనడాలో బలమైన భారతీయ సమాజం

image

కెనడాలో 28 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 18 లక్షల భారత సంతతివారు, 10 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. వాంకోవర్, టొరంటో, మాంట్రియల్, విన్నీ పెగ్, ఒట్టావా ప్రాంతాల్లో అధికంగా జీవిస్తున్నారు. అక్కడ చదివే విదేశీ విద్యార్థుల్లో 45 శాతం మంది భారతీయులే. అక్కడి పథకాల్లో ప్రధాన లబ్ధిదారులూ మనవాళ్లే. 2019లో కెనడా వెళ్లిన భారతీయుల సంఖ్య 2.46 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 28 లక్షలకు చేరుకుంది.

News October 18, 2024

శ్వేతపత్రాలపై ఏం చేశారు? నివేదికివ్వండి: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ సీఎం చంద్రబాబు 2 నెలల కిందట పలు రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అయితే ఆయా శాఖలు వాటిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాయో ప్రభుత్వానికి నివేదించలేదు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.