News October 18, 2024

నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

image

TG: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేయనుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి కోర్టుకు చేరుకుంటారు.

Similar News

News October 18, 2024

మంత్రి సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

image

TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు కేటీఆర్ సోమవారం నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం మూసీపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ నది పునరుజ్జీవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించనున్నారు.

News October 18, 2024

IPL: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునేది వీరినేనా?

image

ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్లకు సంబంధించి ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
MI: రోహిత్, బుమ్రా, సూర్య, హార్దిక్
DC: పంత్, అక్షర్, జేక్/కుల్దీప్, PBKS: అర్ష్‌దీప్
LSG: పూరన్, మయాంక్ యాదవ్, బదోని/మోహ్సిన్
CSK: జడేజా, రుతురాజ్, దూబే, ధోనీ
GT: గిల్, రషీద్, SRH: కమిన్స్, అభిషేక్, క్లాసెన్
RR: శాంసన్, పరాగ్, జురెల్
KKR: శ్రేయస్, రసెల్, నరైన్
RCB: కోహ్లీ, డుప్లెసిస్, సిరాజ్

News October 18, 2024

STOCK MARKETS: ఫైనాన్స్, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్

image

దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. FIIలు వెళ్లిపోవడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎర్లీ ట్రేడ్‌లో సెన్సెక్స్ 80,764 (-233), నిఫ్టీ 24,595 (-54) వద్ద ట్రేడవుతున్నాయి. నిన్న సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్న ఆటో షేర్లు నేడు పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు అక్యూములేట్ చేసుకుంటున్నారు. INFY, BPCL, TITAN టాప్ లూజర్స్.