News October 18, 2024

ముఖ గుర్తింపులో HYD NO.1

image

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ముఖ గుర్తింపులో HYD జిల్లా అగ్రస్థానం దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే హైదరాబాద్‌లో సగటు హాజరు 90 శాతానికి పెరిగినట్లు తెలిపారు. మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 691 ఉండగా, విద్యార్థుల సంఖ్య 92,000లకు పైగా ఉంది. హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య 82,800 కాగా.. ఉపాధ్యాయుల సంఖ్య 5,329గా అధికారులు తెలిపారు.

Similar News

News January 16, 2026

GHMC రిజర్వేషన్లు ఖరారు.. బీసీలకు 40% స్థానాలు

image

GHMC పరిధిలోని 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఫైనల్ చేసింది. 2011 జనాభా లెక్కలు, BC డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. BCలకు 122 స్థానాలు కేటాయించారు. పురుషులు, మహిళలకు సమానంగా చెరో 61 సీట్లు ఇచ్చారు. SCలకు 23 (M-12, F-11), STలకు 5 (M-3, F-2) స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వుడ్‌గా 74 స్థానాలు ప్రకటించారు. మొత్తంగా మహిళలకు 150 స్థానాలు దక్కాయి.

News January 16, 2026

ALERT: HYD వచ్చే NH-65పై ట్రాఫిక్ డైవర్షన్స్

image

పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో సొంతూరెళ్లిన నగరవాసులకు ట్రాఫిక్ అలర్జ్
☛ గుంటూరు→ మిర్యాలగూడ→ హాలియా→ కొండమల్లేపల్లి→ చింతపల్లి- మాల్ మీదుగా HYD
☛ మాచర్ల→ నాగార్జునసాగర్→ పెద్దవూర→ కొండపల్లేపల్లి- చింతపల్లి- మాల్ మీదుగా HYD
☛ నల్లగొండ- మార్రిగూడ బై పాస్- మునుగోడు→ చౌటుప్పల్ (NH-65)మీదుగా HYD
☛ కోదాడ- హుజూర్‌నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా HYD రావాలి.

News January 16, 2026

HYD: నైట్ ఫ్లైఓవర్లు బంద్!

image

‘షబ్-ఏ-మేరాజ్’ సందర్భంగా HYDలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వాహనదారుల భద్రత కోసం ఈ రోజు రా.10 గం. నుంచి రేపు ఉదయం వరకు గ్రీన్‌ల్యాండ్స్, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్‌హౌస్ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, నెక్లెస్ రోడ్‌ మూసేస్తున్నట్లు జాయింట్ CP జోయల్ డేవిస్ తెలిపారు. షేక్‌పేట్, బహదూర్‌పురా ఫ్లైఓవర్లను అవసరాన్ని బట్టి ఓపెన్ చేస్తారు. అత్యవసరమైతే 9010203626 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.