News October 18, 2024
విశాఖ: మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో ఊరట
ఎండాడలోని హైగ్రీవ భూముల వివాదంలో పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనతోపాటు చార్టెడ్ అకౌంటెంట్ జి.వెంకటేశ్వరరావు, బిల్డర్ బ్రహ్మాజీలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని కోర్టు గురువారం ఆదేశించింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వీరు హైకోర్టును ఆశ్రయించారు.
Similar News
News January 24, 2025
విశాఖలో కిడ్నాప్ కలకలం
విశాఖలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువతి పెద్దపాలెం చెందిన రామారావు అనే వ్యక్తికి పలుమార్లు ఫోన్ చేసి ట్రాప్ చేసింది. తగరపువలస సమీపంలో గుడి వద్దకు రావాలని చెప్పడంతో ఆయన వెళ్ళగా నలుగురు యువకులు కిడ్నాప్ చేసి ATM కార్డు, రూ.48,000 నగదు దోపిడీ చేశారు. ఏటీఎంలో రూ.7వేలు డ్రా చేయడంతో రామారావు మోసపోయినట్లు గ్రహించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రాప్ చేసిన యువతి ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు.
News January 24, 2025
పాయకరావుపేటలో ఎయిర్ పోర్ట్కు ప్రతిపాదనలు
పాయకరావుపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముందు తుని-అన్నవరం మధ్య ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రాంతం అనుకూలం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు సమాచారం. పాయకరావుపేట ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండడంతో నిర్మాణానికి అన్ని విధాల అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు భూముల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
News January 24, 2025
విశాఖ పోలీసుల అదుపులో నకిలీ మహిళా ఐఏఎస్..!
ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మహిళాIASతో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అమృత భాగ్యరేఖ అనే మహిళ MVPకాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి విశాఖCPకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో పోలీసులు విచారించగా ఆమె నకిలీ IASగా నిర్ధారణ అయింది.