News October 18, 2024

కృష్ణా: పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని అడ్మిషన్ల డైరెక్టర్ బ్రహ్మాజీరావు తెలిపారు. ఏపీపీజీసెట్-2024లో ర్యాంకులు పొందిన వారు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 21న ఉదయం 9.30 నుంచి 11.30గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కార్యాలయానికి రావాలని చెప్పారు.

Similar News

News September 16, 2025

దేవుడి భూములను కొట్టేస్తే సమగ్ర విచారణ చేసుకోండి – పేర్ని నాని

image

మచిలీపట్నంలోని రంగనాయక స్వామి దేవస్థానంకు చెందిన భూములను తాను కారు చౌకగా కొట్టేశానని కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిజంగా స్వామి వారి భూములను తాను అక్రమ మార్గంలో తీసుకుంటే నాడు జరిగిన వేలంపాటపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అవినీతిని తాను బట్టబయలు చేస్తుండటంతో తనపై కక్ష కట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News September 15, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్‌లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు

News September 15, 2025

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ

image

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గీతాంజలి శర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆమె పనితీరు ప్రశంసలు పొందింది. ఇకపై ఫైబర్ నెట్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త జాయింట్ కలెక్టర్‌పై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.