News October 18, 2024
శ్వేతపత్రాలపై ఏం చేశారు? నివేదికివ్వండి: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ సీఎం చంద్రబాబు 2 నెలల కిందట పలు రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అయితే ఆయా శాఖలు వాటిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాయో ప్రభుత్వానికి నివేదించలేదు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.
Similar News
News February 1, 2026
8మంది MPలను ఇస్తే తిరిగిచ్చింది గుండు సున్నా: బడ్జెట్‌పై కవిత ఫైర్

TG: బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి ఎదురైందని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP MPలను ఇస్తే బదులుగా గుండుసున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. ₹34,367 కోట్ల RRR, మెట్రో ఫేజ్-2 విస్తరణ నిధులు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను కేంద్రం విస్మరించిందన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, IIM వంటి కీలక డిమాండ్లను పట్టించుకోలేదన్నారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
News February 1, 2026
ఫోన్ ట్యాపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలి: కిషన్ రెడ్డి

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రెండేళ్లుగా సీరియల్ కింద సాగదీస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘జడ్జీలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులు కోర్టులో చెప్పారు. తన భర్త ఫోనూ ట్యాప్ చేశారని కవిత అన్నారు. ఈ కేసుపై కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వంలో మంత్రులు, కేసీఆర్ కుటుంబంలో సభ్యులు తమ వాటాల కోసం కొట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
News February 1, 2026
బడ్జెట్‌పై భౌగోళిక రాజకీయాల ఎఫెక్ట్!

ఈసారి బడ్జెట్‌పై జియోపాలిటిక్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రేర్ ఎర్త్ మెటల్స్‌పై చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం రేర్ ఎర్త్ కారిడార్ ప్రకటించింది. అణువిద్యుత్‌కు సంబంధించిన బేసిక్ కస్టమ్స్ డ్యూటీపై 2035 వరకు మినహాయింపు, సెమీకండక్టర్ మిషన్ 2.0 లాంచ్ విదేశాలపై ఆధారపడటం తగ్గించేందుకు తీసుకున్న చర్యలుగా తెలుస్తోంది. రక్షణ పటిష్ఠం చేసేందుకు డిఫెన్స్‌లోనూ భారీగా నిధులు కేటాయించింది.


