News October 18, 2024

మధ్యాహ్న భోజనంలో మార్పులు!

image

AP: నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో క్వాలిటీ పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్‌తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేరుస్తారు.

Similar News

News October 18, 2024

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంను నిలదీయాలి: ఆర్.ఎస్.ప్రవీణ్

image

TG: ఓపెన్ కాంపిటీషన్/అన్ రిజర్వుడ్ కేటగిరీలో SC, ST, BC, మైనార్టీ, EWSలకు ప్రవేశం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా జీవో29ను తీసుకొచ్చిందని డా.ఆర్.ఎస్.ప్రవీణ్ మండిపడ్డారు. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘మీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా సీఎంను నిలదీయండి. ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్నTGPSC బోర్డును రీకాల్ చేయించండి’ అని ట్వీట్ చేశారు.

News October 18, 2024

భారత్‌పై తొలిసారి 300+లీడ్.. భారీ స్కోరు దిశగా కివీస్

image

INDతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా కివీస్ సాగుతోంది. ఇప్పటికే 300+ లీడ్ సాధించింది. ఆ జట్టుకు భారత్‌పై తొలి ఇన్నింగ్సులో ఇదే అత్యధిక లీడ్ కావడం విశేషం. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 2016లో 412(vsZIM), 2005లో 393(vsZIM), 1985లో 374(vsAUS), 2004లో 363(vsBAN) లీడ్ సాధించింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇండియాపై ఈ స్థాయి ఆధిక్యత కనబర్చింది. రచిన్(107*), సౌథీ(59*) క్రీజులో ఉన్నారు.

News October 18, 2024

RETAIL INVESTORSది ట్రాపా? స్ట్రాటజీనా?

image

స్టాక్ మార్కెట్లో రాబడి పూలపాన్పు కాదు. లాసెస్, ప్రెజర్ తట్టుకోవాలి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు సైకలాజికల్ ఎడ్జ్, కన్విక్షన్, సహనం లేకుంటే నష్టపోవడం ఖాయం. చిన్న ఇన్వెస్టర్లు పెద్ద చేపల ట్రాప్‌లో పడటానికి ఇదే రీజన్. SEP క్వార్టర్లో 56PSU షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్లు వాటా పెంచుకోవడం ట్రాప్ అని కొందరు, వాటిని డిప్స్‌లో కొనడం మంచిదేనని మరికొందరు అంటున్నారు. ఏది నిజమవుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.