News October 18, 2024

మందుబాబులకు గుడ్ న్యూస్

image

AP: రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21నాటికి మరో 20 వేల కేసులు చేరుతుందని వివరించారు. రూ.99కే క్వార్టర్ బాటిల్‌ను ఐదు ప్రముఖ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరునాటికి మరింత స్టాక్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

Similar News

News February 5, 2026

జగన్.. అల్లర్ల రాజకీయాలకు స్వస్తి పలకండి: అచ్చెన్నాయుడు

image

AP: జగన్ గుంటూరు పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. ‘తాడేపల్లి నుంచి గుంటూరుకు ప్రయాణం 9 గంటల పాటు సాగదీయడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఇలా మీరు రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించాలని చూడటం సరికాదు. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే రోడ్లపై డ్రామాలు ఆపి ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి. దమ్ముంటే సభలో చర్చిద్దాం. ఇకనైనా అల్లర్ల రాజకీయాలకు స్వస్తి పలకాలి’ అని సూచించారు.

News February 5, 2026

T20 WC: భారత్ ఘన విజయం

image

T20 WC వార్మప్‌ మ్యాచ్‌లో SAపై భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (20 బాల్స్‌లో 53), తిలక్ వర్మ (19 బంతుల్లో 45) దూకుడుగా ఆడగా, హార్దిక్ పాండ్య (10 బంతుల్లో 30) చివర్లో మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

News February 5, 2026

దేశంలో ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

image

దేశంలో డిజిటల్ సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందరికీ ఆ ప్రయోజనాలు చేరడం లేదు. దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉంది. సుమారు 13.7% కుటుంబాలకు ఆన్‌లైన్ సదుపాయం లేదు. అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్‌ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఈ గ్యాప్ ఆందోళన కలిగిస్తోంది.