News October 18, 2024

భారత ‘RAW’ అధికారిపై అమెరికా అభియోగాలు

image

భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ఆఫీసర్ వికాస్ యాదవ్‌పై అమెరికా అభియోగాలు మోపింది. న్యూయార్క్‌లో ఖలీస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూను హతమార్చేందుకు వికాస్ కుట్ర చేశారని FBI పేర్కొంది. ఇందుకోసం నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని నియమించుకున్నారని, గతేడాది అతడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు కమిటీని నియమిస్తామని భారత్ చెప్పగా.. అమెరికా సంతృప్తి వ్యక్తం చేసింది.

Similar News

News October 18, 2024

సంచలనం.. ఇద్దరే 20 వికెట్లు కూల్చేశారు

image

రెండో టెస్టులో ENGపై పాకిస్థాన్ 152 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమన్ అలీ కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్సులూ కలిపి వీరిద్దరే 20 వికెట్లు కూల్చేశారు. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి ఘనత సాధించిన ఏడో ద్వయంగా వీరు నిలిచారు. 52 ఏళ్లలో ఇదే తొలిసారి. నోమన్ 11(3+8), సాజిద్ 9(7+2) వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో వీరిద్దరే బౌలింగ్ చేయడం మరో విశేషం.

News October 18, 2024

రెండు ఖండాలను కలిపే బ్రిడ్జ్ గురించి తెలుసా?

image

రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ఉండటం కామన్. కానీ, 2 ఖండాలను కలిపే వంతెన గురించి మీకు తెలుసా? నార్త్ అమెరికా, యూరప్‌ ఖండాలను కలిపే ‘బ్రిడ్జ్ బిట్వీన్ కాంటినెంట్స్’ అనే ఫుట్ బ్రిడ్జి ఐస్‌లాండ్‌లో ఉంది. 50 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జిని దాటితే గ్రీన్స్‌లాండ్స్‌‌పై అడుగుపెట్టొచ్చు. ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈజీగా ఖండాన్ని దాటొచ్చు. భూమిపై ఏర్పడిన చీలికతో ఖండాన్ని విభజించిన గుర్తులు కనిపిస్తాయి.

News October 18, 2024

టాటా మాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: మూర్తి

image

రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గుర్తుచేసుకున్నారు. ‘టాటా నిరుపేదలు, ఉద్యోగుల గురించి ఎంతో ఆలోచిస్తారు. భారతీయులకు తక్కువ ధరకే కార్లను అందించాలనుకున్నారు. 1999లో నా కుమార్తెకు నాయకత్వ విలువలు, కఠిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే అంశాలపై గంట క్లాస్ చెప్తానని 3 గంటలు తీసుకున్నారు. ఆయన మాటలు నాపైనా, నా కుటుంబంపైనా చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని అన్నారు.