News October 18, 2024
శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరణ

AP: ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో మూసేసిన తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని అధికారులు పునరుద్ధరించారు. యథావిధిగా భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం కొండపై 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని వారికి శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 58,637 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,956 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చింది.
Similar News
News February 2, 2026
పెళ్లి కాదు పనే ముఖ్యం: బాస్

కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పే ఓ ఘటన SMలో వైరలవుతోంది. ‘నా ఎంగేజ్మెంట్ 2 నెలల క్రితమే చెప్పాను. ఆ విషయాన్ని గాలికొదిలేసి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ముఖ్యం కాదు వీకెండ్ కూడా పని చేయమంటున్నారు. ఇక్కడ చేసే వారికంటే పని చెప్పేవారు ఎక్కువ. గంటలు గంటలు జూమ్ కాల్స్ మాట్లాడాలి. నేను ఈ ప్రాజెక్టులో కొనసాగలేను. నా పెళ్లి కూడా వాయిదా వేసుకోలేను’ అని ఆవేదనను వ్యక్తం చేశారు.
News February 2, 2026
మ్యాడ్ సిరీస్‌లో క్రేజీ యాక్టర్స్!

యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా హిట్లు అందుకున్న ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సిరీస్‌లో మూడో సినిమా రాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మ్యాడ్ జూనియర్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో లిటిల్ హార్ట్స్ ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని సినీ వర్గాలు వెల్లడించాయి.
News February 2, 2026
లా అండ్ ఆర్డర్ సమస్య తేవాలని YCP చూస్తోంది: చంద్రబాబు

AP: రాష్ట్రంలో లా & ఆర్డర్ సమస్య తేవాలని YCP చూస్తోందని CM CBN విమర్శించారు. తాజా ఘటనలపై ఆయన TDP నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘TTD లడ్డూ వ్యవహారంలో దొరికిపోయిన YCP దాన్ని దారిమళ్లించేందుకు బూతులు ఎత్తుకుంది. TDPని రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ఆ ట్రాప్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు పడొద్దు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ది జరుగుతోంది. అన్ని వర్గాలూ సంతోషంగా ఉన్నాయి’ అని వివరించారు.


