News October 18, 2024

IPL: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునేది వీరినేనా?

image

ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్లకు సంబంధించి ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
MI: రోహిత్, బుమ్రా, సూర్య, హార్దిక్
DC: పంత్, అక్షర్, జేక్/కుల్దీప్, PBKS: అర్ష్‌దీప్
LSG: పూరన్, మయాంక్ యాదవ్, బదోని/మోహ్సిన్
CSK: జడేజా, రుతురాజ్, దూబే, ధోనీ
GT: గిల్, రషీద్, SRH: కమిన్స్, అభిషేక్, క్లాసెన్
RR: శాంసన్, పరాగ్, జురెల్
KKR: శ్రేయస్, రసెల్, నరైన్
RCB: కోహ్లీ, డుప్లెసిస్, సిరాజ్

Similar News

News October 18, 2024

రెండు ఖండాలను కలిపే బ్రిడ్జ్ గురించి తెలుసా?

image

రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ఉండటం కామన్. కానీ, 2 ఖండాలను కలిపే వంతెన గురించి మీకు తెలుసా? నార్త్ అమెరికా, యూరప్‌ ఖండాలను కలిపే ‘బ్రిడ్జ్ బిట్వీన్ కాంటినెంట్స్’ అనే ఫుట్ బ్రిడ్జి ఐస్‌లాండ్‌లో ఉంది. 50 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జిని దాటితే గ్రీన్స్‌లాండ్స్‌‌పై అడుగుపెట్టొచ్చు. ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈజీగా ఖండాన్ని దాటొచ్చు. భూమిపై ఏర్పడిన చీలికతో ఖండాన్ని విభజించిన గుర్తులు కనిపిస్తాయి.

News October 18, 2024

టాటా మాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: మూర్తి

image

రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గుర్తుచేసుకున్నారు. ‘టాటా నిరుపేదలు, ఉద్యోగుల గురించి ఎంతో ఆలోచిస్తారు. భారతీయులకు తక్కువ ధరకే కార్లను అందించాలనుకున్నారు. 1999లో నా కుమార్తెకు నాయకత్వ విలువలు, కఠిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే అంశాలపై గంట క్లాస్ చెప్తానని 3 గంటలు తీసుకున్నారు. ఆయన మాటలు నాపైనా, నా కుటుంబంపైనా చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని అన్నారు.

News October 18, 2024

కాంగ్రెస్ IT సెల్‌కు ‘Head’ కష్టాలు!

image

కేరళ కాంగ్రెస్‌ IT సెల్‌లో విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. హెడ్‌గా ఎవరొచ్చినా కొన్నాళ్లకు ప్రత్యర్థి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్రపై BBC డాక్యుమెంటరీని కాంగ్రెస్ ఎండార్స్ చేసిందని AK ఆంటోనీ కొడుకు అనిల్ వెళ్లిపోయారు. BJP నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. సివిల్ సర్వీసెస్ నుంచి పాలిటిక్స్‌లో జాయినైన Dr సరిన్ P తాజాగా CPMకు అనుకూలంగా మాట్లాడటంతో ఆయనపై వేటు పడింది.