News October 18, 2024
మధ్యాహ్నం జగన్ ప్రెస్ మీట్

AP: మాజీ సీఎం జగన్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. నూతన మద్యం పాలసీ, ఇసుక విధానాలు, వైసీపీ నేతలపై కేసులు, ఇతర అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ కార్యాచరణను వివరిస్తారని సమాచారం.
Similar News
News November 3, 2025
సర్పాలు, నాగులు ఒకటి కాదా?

పురాణాల ప్రకారం.. సర్పాలు, నాగులు వేర్వేరని పండితులు చెబుతున్నారు. సర్పాలంటే భూమిపై తిరిగే పాములని, నాగులంటే దైవ స్వరూపాలని అంటున్నారు. ‘సర్పాలు విషపూరితమైనవి. నాగులు విషరహితమైనవి. నాగులు కోరుకున్న రూపాన్ని ధరించగలవు. అలాగే వీటికి ప్రత్యేకంగా ‘నాగ లోకం’ కూడా ఉంది. ఇవి గాలిని పీల్చి జీవిస్తాయి. కానీ సర్పాలు నేల/నీటిలో మాత్రమే ఉంటాయి. ఇవి నేలను అంటిపెట్టుకొని పాకుతాయి’ అని వివరిస్తున్నారు.
News November 3, 2025
రూ.500కే రూ.16 లక్షల ప్లాటు గెలిచింది

TG: లాటరీలో ఓ 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో తీసిన లక్కీ డ్రాలో రూ.500కే ఏకంగా రూ.16 లక్షల విలువైన ప్లాటును గెలుచుకుంది. రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి 66 గజాల ప్లాటుకు లక్కీ డ్రా నిర్వహించారు. శంకర్ అనే వ్యక్తి ఫ్యామిలీ పేరుతో 4 కూపన్లు తీసుకోగా.. 2307 అనే నంబరుతో కుమార్తె హన్సికకు ఈ బహుమతి దక్కింది. రూ.500కే ప్లాటు దక్కడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
News November 3, 2025
Take A Bow: మనసులు గెలిచిన కెప్టెన్ లారా

భారత్ ఉమెన్స్ WCను లిఫ్ట్ చేసినప్పుడు గెలుపు గర్జనతో స్టేడియం మారుమోగింది. అంతా విజయోత్సాహంలో నిండిపోయారు. కానీ, SA కెప్టెన్ లారా ముఖంలో విషాదం నిండిపోయింది. ఫైనల్లో సెంచరీ సహా 9 మ్యాచుల్లో 571 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా SAకి తొలి WC అందించాలన్న తన కల సాకారం కాలేదు. అయితే ఆమె పోరాటం క్రికెట్ అభిమానుల మనసులు గెలిచింది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


