News October 18, 2024

VZM: డయేరియాతో ఒకరు, మనస్తాపంతో మరొకరు మృతి

image

గుర్ల మండలంలో డయేరియాతో మరొకరు మృతిచెందారు. ప్రతివాడ సూరమ్మ (70 ) డయేరియాతో శుక్రవారం మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన కలిసేట్టి రవి (28) తల్లి కలిసేటి సీతమ్మ మంగళవారం డయేరియాతో మృతి చెందింది. తల్లి మరణం తట్టుకోలేక మనస్తాపానికి గురైన రవి శుక్రవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు రోజు రోజుకు పెరగడంతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Similar News

News November 23, 2024

డిసెంబర్ 9లోగా క్లెయిమ్ చేసుకోవాలి: కలెక్టర్ అంబేడ్కర్

image

ఉత్తరాంధ్రా ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాలో క్లెయిమ్స్, అభ్యంతరాలను డిసెంబర్ నెల 9 లోగా సమర్పించవలసి ఉంటుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి డ్రాఫ్ట్ రోల్ ప్రచురణ నవంబర్ 23న జరుగుతుందని, డిసెంబర్ 9 లోగా క్లెయిమ్స్ , అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

News November 23, 2024

VZM: సంక్రాంతి నాటికి జిల్లాలో గుంతలు లేని రోడ్లు

image

విజయనగరం జిల్లాకు 176 రోడ్ల ప‌నులు మంజూరయ్యాయి. రూ.23.51 కోట్ల‌తో ఈ ప‌నులను R&B శాఖ చేప‌డుతుంది. ఇందులో భాగంగా 750 కిలోమీట‌ర్ల రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు జరగనున్నాయి. తొలివిడ‌త‌లో 68 ప‌నులకు రూ.10.54 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిలో ఇప్పటికే 61 ప‌నుల‌కు టెండ‌ర్లు ఖ‌రారయ్యాయి. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 23, 2024

విజయనగరం: మొదట ప్రేమ.. ఆపై చీటింగ్

image

మహిళను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం DSP శుక్రవారం తెలిపారు. గంట్యాడలోని కిర్తిబర్తికి చెందిన వెంకట సత్యం ఓ కళాశాలలో ఫ్యాకల్టీగా చేసేవాడు. అదే కళాశాలలో ఫ్యాకల్టీగా ఉన్న దళిత మహిళకు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.