News October 18, 2024

RETAIL INVESTORSది ట్రాపా? స్ట్రాటజీనా?

image

స్టాక్ మార్కెట్లో రాబడి పూలపాన్పు కాదు. లాసెస్, ప్రెజర్ తట్టుకోవాలి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు సైకలాజికల్ ఎడ్జ్, కన్విక్షన్, సహనం లేకుంటే నష్టపోవడం ఖాయం. చిన్న ఇన్వెస్టర్లు పెద్ద చేపల ట్రాప్‌లో పడటానికి ఇదే రీజన్. SEP క్వార్టర్లో 56PSU షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్లు వాటా పెంచుకోవడం ట్రాప్ అని కొందరు, వాటిని డిప్స్‌లో కొనడం మంచిదేనని మరికొందరు అంటున్నారు. ఏది నిజమవుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Similar News

News October 18, 2024

భారతీయులకు UAE ‘వీసా ఆన్ అరైవల్’.. కానీ..

image

భారత పాస్‌పోర్టు కలిగిన వారికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే ఆ దేశం వెళ్లిన తర్వాత తొలి 14 రోజులకు వీసా తీసుకోవచ్చు. ఆ తర్వాత పొడిగించుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించకపోవడం ఇక్కడ గమనార్హం. USA వీసా, రెసిడెన్స్ పర్మిట్ లేదా గ్రీన్ కార్డ్, ఈయూ-యూకే నుంచి వీసా, రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారికే ఈ సౌకర్యాన్ని యూఏఈ కల్పించింది.

News October 18, 2024

పెళ్లికాని అమ్మాయిలు ఎల్లుండి ఇలా చేస్తే..

image

ఎల్లుండి(ఆదివారం) అట్లతద్ది. ఇది మహిళల పండుగ. ముఖ్యంగా పెళ్లికాని యువతులు మంచి భాగస్వామి రావాలని కోరుతూ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. గౌరీదేవిని పూజించి, అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. పరమశివుడిని భర్తగా పొందాలని కోరుతూ గౌరీదేవి ఈ వ్రతం ఆచరించినట్లు పురాణాల గాథ. అటు పెళ్లయిన మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షుతో జీవించాలని ఈ వ్రతం చేస్తారు. ఉత్తరాదిలో అట్లతద్దిని కర్వాచౌత్‌గా జరుపుకుంటారు.

News October 18, 2024

Health Risk: నిలబడి పనిచేస్తున్నారా!

image

శారీరక శ్రమ లేదని ఆఫీసుల్లో స్టాండింగ్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వీటితోనూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రీసెర్చర్స్ అంటున్నారు. రోజుకు 2Hrs పైగా నిలబడి పనిచేస్తే వెరికోస్ వీన్స్, నరాల్లో రక్తప్రసరణ తగ్గే జబ్బులు వస్తున్నాయని హెచ్చరించారు. అందుకే మరీ ఎక్కువగా కూర్చోకుండా, నిలబడకుండా ఇంటర్వల్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒంటి కాలిమీద బరువు పెట్టొద్దని, పోస్చర్ మార్చుకోవాలని అంటున్నారు.