News October 18, 2024

భారత్‌పై తొలిసారి 300+లీడ్.. భారీ స్కోరు దిశగా కివీస్

image

INDతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా కివీస్ సాగుతోంది. ఇప్పటికే 300+ లీడ్ సాధించింది. ఆ జట్టుకు భారత్‌పై తొలి ఇన్నింగ్సులో ఇదే అత్యధిక లీడ్ కావడం విశేషం. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 2016లో 412(vsZIM), 2005లో 393(vsZIM), 1985లో 374(vsAUS), 2004లో 363(vsBAN) లీడ్ సాధించింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇండియాపై ఈ స్థాయి ఆధిక్యత కనబర్చింది. రచిన్(107*), సౌథీ(59*) క్రీజులో ఉన్నారు.

Similar News

News October 18, 2024

భారతీయులకు UAE ‘వీసా ఆన్ అరైవల్’.. కానీ..

image

భారత పాస్‌పోర్టు కలిగిన వారికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే ఆ దేశం వెళ్లిన తర్వాత తొలి 14 రోజులకు వీసా తీసుకోవచ్చు. ఆ తర్వాత పొడిగించుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించకపోవడం ఇక్కడ గమనార్హం. USA వీసా, రెసిడెన్స్ పర్మిట్ లేదా గ్రీన్ కార్డ్, ఈయూ-యూకే నుంచి వీసా, రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారికే ఈ సౌకర్యాన్ని యూఏఈ కల్పించింది.

News October 18, 2024

పెళ్లికాని అమ్మాయిలు ఎల్లుండి ఇలా చేస్తే..

image

ఎల్లుండి(ఆదివారం) అట్లతద్ది. ఇది మహిళల పండుగ. ముఖ్యంగా పెళ్లికాని యువతులు మంచి భాగస్వామి రావాలని కోరుతూ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. గౌరీదేవిని పూజించి, అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. పరమశివుడిని భర్తగా పొందాలని కోరుతూ గౌరీదేవి ఈ వ్రతం ఆచరించినట్లు పురాణాల గాథ. అటు పెళ్లయిన మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షుతో జీవించాలని ఈ వ్రతం చేస్తారు. ఉత్తరాదిలో అట్లతద్దిని కర్వాచౌత్‌గా జరుపుకుంటారు.

News October 18, 2024

Health Risk: నిలబడి పనిచేస్తున్నారా!

image

శారీరక శ్రమ లేదని ఆఫీసుల్లో స్టాండింగ్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వీటితోనూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రీసెర్చర్స్ అంటున్నారు. రోజుకు 2Hrs పైగా నిలబడి పనిచేస్తే వెరికోస్ వీన్స్, నరాల్లో రక్తప్రసరణ తగ్గే జబ్బులు వస్తున్నాయని హెచ్చరించారు. అందుకే మరీ ఎక్కువగా కూర్చోకుండా, నిలబడకుండా ఇంటర్వల్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒంటి కాలిమీద బరువు పెట్టొద్దని, పోస్చర్ మార్చుకోవాలని అంటున్నారు.