News October 18, 2024
భారత్తో టెస్టు.. కివీస్ 402 పరుగులకు ఆలౌట్
INDతో తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్లో కివీస్ 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో 356 పరుగుల ఆధిక్యత సాధించింది. రచిన్ రవీంద్ర 134, కాన్వే 91, టిమ్ సౌథీ 65, విల్ యంగ్ 33 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ చెరో 3 వికెట్లు, సిరాజ్ 2, అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 46 స్కోరుకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇంకా రెండు రోజుల ఆట మిగిలిఉండటంతో భారత్ చెమటోడ్చాల్సి ఉంది.
Similar News
News January 3, 2025
SHOCKING: జట్టు నుంచి రోహిత్ ఔట్!
సిడ్నీ టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రచారంలో ఉన్నట్లుగా రోహిత్ శర్మ తుది జట్టు నుంచి తప్పుకొన్నారు. ఆయనకు బదులు కెప్టెన్గా బుమ్రా టాస్కు వచ్చారు. రోహిత్ స్వచ్ఛందంగా రెస్ట్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక తుది జట్టులో రోహిత్ స్థానంలో గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్నారు. ఆస్ట్రేలియాకు మార్ష్ స్థానంలో వెబ్స్టెర్ డెబ్యూ కానున్నారు.
News January 3, 2025
‘టెట్’ తొలిరోజు ప్రశాంతం
TG: రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు తొలిరోజైన గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు పరీక్షకు ఉదయం 72.25శాతం మంది, మధ్యాహ్నం 75.68శాతం మంది హాజరయ్యారు. ఈ నెల 20 వరకు 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2, 8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్షని నిర్వహించనున్నారు.
News January 3, 2025
2097 స్కూళ్లలో విద్యార్థులు లేరు!
TG: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2097 స్కూళ్లలో పిల్లలే లేరని డీఐఎస్ఎఫ్ఏ విడుదల చేసిన నివేదిక(2023-2024) తేల్చిచెప్పింది. పశ్చిమ బెంగాల్(3254), రాజస్థాన్(2187) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 12,954 ఉండగా వాటిలో తెలంగాణలోనే 2వేల పైచిలుకు ఉండటం ఆందోళనకరం.