News October 18, 2024

సిబ్బంది సంక్షేమమే పరమావధి: కడప ఎస్పీ

image

కడప జిల్లాలోని పోలీస్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించి మంచి పేరు తీసుకుని రావాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. గార్డు విధుల్లోని ఏఆర్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా.. జిల్లా ఎస్పీ నేడు వారికి సీలింగ్ ఫ్యాన్లు, బెడ్స్, వాటర్ డిస్పెన్సర్లు వంటి పరికరాలను అందించారు.

Similar News

News April 9, 2026

కడప జిల్లా MLAలపై లోకేశ్ ఆగ్రహం

image

జిల్లాలోని TDP ఎమ్మెల్యేలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు MLAలు మాధవిరెడ్డి, చైతన్యరెడ్డి, పుట్టా సధాకర్ యాదవ్, వరదరాజులు రెడ్డి, పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు దూరంగా ఉండటం, 4 వారాలుగా గ్రీవెన్స్‌లు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉండటమే కారణమట. మళ్లీ ఇది రిపీట్ అయితే నోటీసులు ఇస్తామని చెప్పారట.

News April 9, 2026

కడప: 253 మందిపై కేసులు నమోదు

image

వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం కడప జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 253 మందిపై కేసులు నమోదు చేసి వారికి రూ.57,195 ల జరిమానా విధించారు. ద్విచక్ర వాహనం దారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పక ధరించాలని సూచించారు.

News April 9, 2026

గండికోటలో అటవీశాఖ అలర్ట్..!

image

గండికోటలో గొర్రెల మందపై చిరుతపులుల దాడి ఘటన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్థులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, చిరుతపులుల సంచారంపై నిఘా పెంచినట్లు తెలిపారు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రత కోసం పలుచోట్ల బోనులు ఏర్పాటు చేసి చిరుతపులులను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.