News October 18, 2024

బినామీ పదానికి అర్థమేంటి? ఈ చట్టమేంటి?

image

బినామీ హిందీపదం. పేరు లేదని దీనర్థం. ఏదైనా ఆస్తి ఓనర్ కాకుండా ఇతరుల పేరుతో ఉంటే దానిని బినామీ ప్రాపర్టీ అంటారు. 1988లో బినామీ లావాదేవీల నిషేధ చట్టం కేవలం 8 సెక్షన్లతో అమల్లోకి వచ్చింది. 2016లో మోదీ ప్రభుత్వం దానిని 72 సెక్షన్లకు పెంచుతూ సవరించింది. అనేక ఆస్తులు, మోసాలు, లావాదేవీలను వర్గీకరించింది. స్థిర, చర, టచ్ చేయలేని, కనిపించని ఆస్తులూ ఇందులో చేర్చింది. కొన్నిటికి కఠిన శిక్షలు నిర్దేశించింది.

Similar News

News October 18, 2024

పోలీసుల అదుపులో బిగ్ బాస్ కంటెస్టెంట్

image

బిగ్ బాస్-8 కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆయనను 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. శేఖర్ బాషా తనపై నిరాధార ఆరోపణలు చేశారని బాధితురాలు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 18, 2024

ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు: ప్రభుత్వం

image

AP: రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది. గతంలో రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లకూ వర్తింపచేసింది. పలుచోట్ల ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాగా GO ఇచ్చింది.

News October 18, 2024

26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు: చంద్రబాబు

image

AP: ఈ నెల 26వ తేదీ నుంచి TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, ₹లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ₹5లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని, చనిపోయిన కార్యకర్తకు మట్టి ఖర్చుల కింద అదనంగా ₹10వేలు ఇస్తామని ఆ పార్టీ MLA, MP, MLCలతో జరిగిన భేటీలో వెల్లడించారు.