News October 18, 2024
కృష్ణా: కాంట్రాక్ట్ పద్ధతిన 20 పోస్టులకు నోటిఫికేషన్

కృష్ణా జిల్లాలోని అర్బన్ PHCలలో కాంట్రాక్ట్ పద్ధతిన 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ 5 గంటలలోపు ఆఫ్‌లైన్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాల విద్యార్హతల వివరాలు, దరఖాస్తు నమూనాకు అభ్యర్థులు https://krishna.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో RECRUITMENT ట్యాబ్ చూడవచ్చు. share it.
Similar News
News May 7, 2025
కృష్ణా: విడిదలైన సెలవులు.. గాలిలో గల్లంతైన ఉపశమనం.!

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుంటే, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవులు ప్రకటించాయి. కానీ అదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం బ్రిడ్జ్ కోర్సుల పేరుతో విద్యార్థులపై హాజరు ఒత్తిడి తెస్తున్నారు. ఉదయం నుంచి మిడ్డే వరకు మండే ఎండలో తరగతులు సాగుతున్నాయి. ఇరు వైపుల ఒత్తిడితో విద్యార్థులు విసుగెత్తిపోతుండగా, తల్లిదండ్రులు అధికారుల జోక్యం కోరుతున్నారు.
News May 7, 2025
మచిలీపట్నం: జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మూడు రోజులు క్రితం బాధ్యతలు స్వీకరించిన గోపిని శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులో జడ్జిని కలిసిన కలెక్టర్ మొక్కను అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరు కొద్దిసేపు భేటీ అయి జిల్లాలో జరుగుతున్న పరిపాలనా అంశాలు, న్యాయ అంశాలపై చర్చించారు.
News May 7, 2025
గన్నవరం విమానాశ్రయంలో మోదీ పర్యటనపై సమీక్ష

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా అంశాలపై గన్నవరం విమానశ్రయంలో ప్రభుత్వ విభాగాల అధికారులు, విమానశ్రయ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి వీరపాండ్యన్, కలెక్టర్ డీ.కే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, S.P గంగాధర రావు, విమానశ్రయ డైరక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.