News October 18, 2024

INDvsNZ: రచిన్ రవీంద్ర రికార్డ్

image

ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగారు. ఆయన 13 ఫోర్లు, 4 సిక్సులతో 134 పరుగులు చేశారు. దీంతో 2012 తర్వాత భారత గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా రచిన్ చరిత్ర సృష్టించారు. ఇన్నింగ్స్ పూర్తయ్యాక రచిన్‌కు స్టేడియంలోని ప్రేక్షకులు సైతం స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందించారు. 2012లో ఇదే స్టేడియంలో రాస్ టేలర్(113) సెంచరీ చేశారు.

Similar News

News October 18, 2024

కొత్త అవతారంలో రాహుల్ చౌదరి

image

తెలుగు టైటాన్స్ మాజీ కెప్టెన్, కబడ్డీ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి ప్రొకబడ్డీకి వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి సీజన్ ప్రారంభం కానుండగా రాహుల్ కొత్త అవతారంలో కనిపించారు. కబడ్డీ అనలిస్ట్‌గా, హ్యాండ్సమ్ లుక్‌లో ఆయన దర్శనమిచ్చారు. 31 ఏళ్ల రాహుల్ చౌదరిని ఈ సారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనేందుకు ఆసక్తి చూపించలేదు.

News October 18, 2024

ఇసుకపై సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు ఎత్తివేస్తున్నాం: చంద్రబాబు

image

AP: ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో సీఎం ఈమేరకు ప్రకటించారు. కాగా ఇప్పటికే రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇవాళ సాయంత్రం <<14392031>>అనుమతి<<>> ఇచ్చింది.

News October 18, 2024

పాక్ రండి.. మ్యాచ్ ఆడగానే వెళ్లిపోండి: PCB

image

తమ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేలా చేయడానికి PCB శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా BCCI ముందు కొత్త ప్రతిపాదన పెట్టింది. పాక్‌లో ఉండటానికి భద్రతాపరమైన కారణాలు అడ్డొస్తున్నాయనుకుంటే IND ఆడే ప్రతి మ్యాచ్ తర్వాత తిరిగి చండీగఢ్ లేదా ఢిల్లీకి వెళ్లిపోవచ్చని చెప్పినట్లు cricbuzz తెలిపింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ వెళ్లేది లేదని అంటున్న BCCI, PCB ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో?