News October 18, 2024

ఎంతవరకైనా పోరాడతా: బండి సంజయ్

image

TG: గ్రూప్-1 అభ్యర్థుల కోసం ఎంతవరకైనా పోరాడతానని కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. జీవో 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు. మెయిన్స్‌ను రీషెడ్యూల్ చేసేవరకు ఉద్యమిస్తానని బండి వెల్లడించారు. మరోవైపు పరీక్ష వాయిదా వేయాలంటూ HYD అశోక్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మరెవరూ నిరసనకు దిగకుండా అక్కడ భారీగా మోహరించారు.

Similar News

News October 18, 2024

గ్రూప్-1 ఇష్యూ.. జీవో 55, జీవో 29 ఏంటి?

image

TG:GO-55 ప్రకారం 1 JOBకి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని సెలక్ట్ చేస్తారు. మిగతా రిజర్వుడ్ పోస్టులకు ఆయా అభ్యర్థులనే ఎంచుకుంటారు. రిజర్వుడ్ అభ్యర్థులకు వారి కోటా, ఓపెన్‌లోనూ ఛాన్సుంటుంది. GO 29 ప్రకారం ఓపెన్‌లో రిజర్వుడ్ అభ్యర్థులకు ఛాన్సుండదు. టాప్ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌లోనే పరిగణించడంతో మరో రిజర్వుడ్ అభ్యర్థికి ఛాన్స్ ఉండదు. దీంతో GO 29 రద్దు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

News October 18, 2024

గ్రూప్-1 అభ్యర్థులకు KTR భరోసా

image

TG: గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. సీఎం ఆదేశాలతో నిరుద్యోగులపై పోలీసులు జులుం చూపించారని మండిపడ్డారు. నిరుద్యోగులపై ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు BRS అండగా ఉంటుందని KTR భరోసా ఇచ్చారు. అటు అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News October 18, 2024

డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఓటమి

image

డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా టుంజుంగ్ చేతిలో 13-21, 21-16, 9-21 తేడాతో ఆమె పరాజయంపాలయ్యారు. ఆమె ఓటమితో ఈ టోర్నీ నుంచి భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మిగిలిన అన్ని విభాగాల్లోనూ భారత ప్లేయర్లు ముందే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.