News October 18, 2024
ఆ రికార్డులో రెండో స్థానానికి కోహ్లీ

టెస్టుల్లో విరాట్ కోహ్లీ 9వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన హాఫ్ సెంచరీ దాటారు. ఈక్రమంలో ఈ ఘనత అందుకున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన క్రికెటర్లలో రెండో స్థానంలో ఆయన కొనసాగుతున్నారు. 596 ఇన్నింగ్స్‌లలో ఆయన 221 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో సచిన్(264) అగ్రస్థానంలో ఉన్నారు.
Similar News
News November 5, 2025
మరో 4 కొత్త రెవెన్యూ డివిజన్లు?

AP: నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రెవెన్యూ డివిజన్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరోవైపు కైకలూరు సెగ్మెంట్‌ను కృష్ణా జిల్లాలో, గన్నవరం, నూజివీడులను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. ఇవాళ వీటిపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.
News November 5, 2025
పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.
News November 5, 2025
కార్తీక మాసం: ఉసిరి దీపం ఎందుకు పెడతారు?

ఉసిరి చెట్టు అంటే శివస్వరూపం. అందుకే కార్తీకంలో దానికి పూజలు చేస్తారు. దీని కింద దీపం పెడితే సకల కష్టాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శివ పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం పెడితే విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి.. ఈ దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవీ ఆర్థిక బాధలన్నీ తొలగిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శుభప్రదం.


