News October 18, 2024

ప్రభాస్‌తో సినిమా.. ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఇదే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఇక చాలు సైలెంట్‌గా ఉండండి’ అని అర్థం వచ్చేలా ఆయన ఎమోజీని ట్వీట్ చేశారు. దీనిని ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ‘ఇక చాలు’ డైలాగ్‌తో పోలుస్తూ ప్రచారం ఆపమనే ప్రశాంత్ అలా ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News July 9, 2025

మార్కెట్‌లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్.. అదేంటంటే?

image

మీకు పెళ్లిళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడమంటే ఇష్టమా? అయితే తెలియని వారి పెళ్లిలో కొత్తవారితో సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా నగరాల్లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్ నడుస్తోంది. నిర్వాహకులు ఏర్పాటు చేసే ఈ ఫేక్ పెళ్లిలో వధువు, వరుడు ఉండరు. కానీ, అన్ని వేడుకలు, వివాహ భోజనం, బరాత్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో రూ.1499 చెల్లించి టికెట్ కొనొచ్చు. ఈ ట్రెండ్ గురించి చర్చ జరుగుతోంది.

News July 9, 2025

తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 9, 2025

మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

image

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.