News October 18, 2024

స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు: లోకేశ్

image

AP: సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ స్కూళ్లకు ₹8.63cr KGBVలకు ₹35.16cr, మండల రిసోర్స్ కేంద్రాలకు ₹8.82cr, మిగతా స్కూళ్లకు ₹51.90cr ఇచ్చారు. సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామాగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్, తాగునీటి కోసం ఈ నిధులు వాడాలన్నారు లోకేశ్.

Similar News

News October 18, 2024

టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు

image

టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు టీమ్ ఇండియా 102 సిక్సర్లు బాదింది. అంతకుముందు ఇంగ్లండ్(89-2022) పేరిట ఈ రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానంలోనే భారత జట్టు(81-2021) ఉండటం విశేషం.

News October 18, 2024

విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

image

TG: రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు, వెంకటేశ్, జ్యోత్స్నను నియమించింది. అంతకుముందు కమిషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించిన సంగతి తెలిసిందే.

News October 18, 2024

డిప్యూటీ కలెక్టర్ పీవీ సింధు ఓడీ సదుపాయం మరో ఏడాది పొడిగింపు

image

AP: స్టార్ షట్లర్ పీవీ సింధు ఆన్‌డ్యూటీ సదుపాయాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న సింధు హైదరాబాద్‌లో ఏపీ అధీనంలోని లేక్‌వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా కొనసాగుతున్నారు. అయితే అంతర్జాతీయ పోటీల్లో శిక్షణ కోసం ఆమెకు 2025 సెప్టెంబర్ 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా ఆరోసారి దీన్ని పొడిగించినట్లు వెల్లడించింది.