News October 18, 2024

పోలీసుల అదుపులో బిగ్ బాస్ కంటెస్టెంట్

image

బిగ్ బాస్-8 కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆయనను 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. శేఖర్ బాషా తనపై నిరాధార ఆరోపణలు చేశారని బాధితురాలు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 19, 2024

ఫైనల్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

image

టీ20 మహిళల వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచింది. 129 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్‌ 120/8కే పరిమితమైంది. ఆ జట్టులో డాటిన్ (33) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కివీస్ బౌలర్లలో కార్సన్ 3, కెర్ 2 వికెట్లు తీశారు. ఎల్లుండి దుబాయ్‌లో జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.

News October 19, 2024

అక్టోబర్ 22 నుంచి ఆధార్ క్యాంపులు

image

AP: అక్టోబర్ 22 నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లలో 4 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనుంది. ఇందుకోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలు అందించనున్నారు.

News October 19, 2024

ట్రంప్‌కే విజయావకాశాలు: బెట్టింగ్ సైట్లు

image

US అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌తో పోలిస్తే డొనాల్డ్ ట్రంప్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని బెట్టింగ్ సైట్లు తేల్చిచెబుతున్నాయి. వీరిద్దరిలో గెలుపెవరిదన్నదానిపై అంతర్జాతీయంగా బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ట్రంప్ గెలిచేందుకు 60శాతం అవకాశముందని పాలీమార్కెట్ పేర్కొనగా, బెట్‌ఫెయిర్, స్మార్కెట్స్ సైట్లు చెరో 58శాతం, కాల్షీ 57శాతం, ప్రెడిక్టిట్ 54శాతం ఛాన్స్ ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి.