News October 18, 2024
పాక్ రండి.. మ్యాచ్ ఆడగానే వెళ్లిపోండి: PCB

తమ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేలా చేయడానికి PCB శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా BCCI ముందు కొత్త ప్రతిపాదన పెట్టింది. పాక్‌లో ఉండటానికి భద్రతాపరమైన కారణాలు అడ్డొస్తున్నాయనుకుంటే IND ఆడే ప్రతి మ్యాచ్ తర్వాత తిరిగి చండీగఢ్ లేదా ఢిల్లీకి వెళ్లిపోవచ్చని చెప్పినట్లు cricbuzz తెలిపింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ వెళ్లేది లేదని అంటున్న BCCI, PCB ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో?
Similar News
News October 29, 2025
ఆలయంలో దైవ దర్శనం ఎలా చేసుకోవాలి?

ఆలయానికి వెళ్తే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించాలి. గర్భాలయంలో దేవుణ్ని మొక్కేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. దేవుని దృష్టికి అడ్డు రాకుండా పక్కకు జరిగి దర్శించుకోవాలి. కళ్లు మూయకుండా.. తెరిచే భగవంతున్ని దర్శించుకోవాలి. ఆయన దివ్య స్వరూపాన్ని, తేజస్సును మనసులో పదిలం చేసుకోవాలి. మన దృష్టిని భగవంతునిపై నిలిపి, అనుగ్రహాన్ని పొందాలి. దర్శనం తర్వాత ప్రశాంతంగా ప్రదక్షిణలు చేయాలి.
News October 29, 2025
క్రెడిట్ కార్డులతో రికార్డు స్థాయి కొనుగోళ్లు

సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డులతో రికార్డు స్థాయి (₹2.17 లక్షల కోట్లు) కొనుగోళ్లు జరిగాయి. ఆగస్టుతో పోలిస్తే ఇది 14% అధికం. ఫెస్టివల్ సీజన్, బ్యాంకులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల డిస్కౌంట్లు, ఆఫర్లతో పాటు GST రేట్లలో కోత ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025 మార్చిలో ₹2.015 ట్రిలియన్, ఆగస్టులో ₹1.91T కొనుగోళ్లు నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇది ₹1.76లక్షల కోట్లుగా ఉంది.
News October 29, 2025
సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిలా ఎలా మారాడు?

పూర్వకాలంలో సంవత్సర ప్రారంభాన్ని కృత్తికా(కార్తీక) నక్షత్రంతో లెక్కించేవారు. ఆ నక్షత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి ఓ గొప్ప అనుబంధం ఉంది. ఈ నక్షత్రం ఆరు తారల సమూహం. సుబ్రహ్మణ్య స్వామిని కూడా షణ్ముఖుడు అని అంటారు. అంటే ఆరు తలలు గలవాడు అని అర్థం. ఆకాశంలో ఉన్న ఈ ఆరు కృత్తికా నక్షత్రాలే తల్లి రూపంలో వచ్చి ఆయనకు పాలు ఇచ్చాయట. అందువల్లే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.


