News October 18, 2024
ఇసుకపై సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు ఎత్తివేస్తున్నాం: చంద్రబాబు
AP: ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో సీఎం ఈమేరకు ప్రకటించారు. కాగా ఇప్పటికే రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇవాళ సాయంత్రం <<14392031>>అనుమతి<<>> ఇచ్చింది.
Similar News
News October 19, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 19, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు
అసర్: సాయంత్రం 4:14 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:52 గంటలకు
ఇష: రాత్రి 7.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 19, 2024
సర్ఫరాజ్ రేపు డబుల్ సెంచరీ కొడతారు: కుల్దీప్
బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్‌కు భారత్ దీటుగా బదులిస్తున్న సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా ఆశలు సర్ఫరాజ్ ఖాన్‌పై ఉన్నాయని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నారు. ‘ఇరానీ ట్రోఫీలో అతడి డబుల్ సెంచరీ అందరం చూశాం. అలాంటి ఇన్నింగ్సే రేపు ఆశిస్తున్నాం. స్పిన్నర్లపై అతడి టెక్నిక్ అద్భుతం. వారిని కుదురుకోనివ్వకుండా ఆడతారు. న్యూజిలాండ్ స్పిన్నర్లపై ఎదురుదాడి చేస్తున్నారు’ అని ప్రశంసించారు.
News October 19, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.