News October 18, 2024
బొబ్బిలిలో యాక్సిడెంట్.. ఒకరు మృతి

బొబ్బిలి ఫ్లైఓవర్ డౌన్‌లో టూవీలర్‌పై నుంచి భారీ కంటైనర్ వెళ్ళిపోవడంతో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించాడు. మృతుడు మెట్టవలస గ్రామానికి చెందిన కర్రి సత్యనారాయణగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలైనట్లు సమాచారం. బొబ్బిలి ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ ఘటన స్థలానికి సిబ్బందితో చేరుకున్నారు. వివరాలు సేకరించడంతో పాటు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
Similar News
News February 16, 2026
లోకల్ హాలిడే ఉన్నా పరీక్ష తప్పనిసరి: డీఈవో

విజయనగరం జిల్లాలోని అన్ని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు డీఈవో మాణిక్యాలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే 10వ తరగతి ప్రీఫైనల్ బయాలజీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని తెలిపారు. లోకల్ హాలిడే ఉన్నా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఇది ఇలా ఉండగా మిగతా క్లాసులకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించాయి. మరి మీ స్కూల్‌కు సెలవు ఇచ్చారా..
News February 15, 2026
VZM: సుమారు 1000 మందితో భద్రత ఏర్పాట్లు

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. రామతీర్థం, పుణ్యగిరి, సంగం దేవాలయాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సుమారు 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. బందోబస్తులో నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 160 మంది ఎఎస్ఐలు, హెచ్సీలు విధులు నిర్వర్తిస్తారన్నారు.