News October 18, 2024

టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు

image

టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు టీమ్ ఇండియా 102 సిక్సర్లు బాదింది. అంతకుముందు ఇంగ్లండ్(89-2022) పేరిట ఈ రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానంలోనే భారత జట్టు(81-2021) ఉండటం విశేషం.

Similar News

News October 19, 2024

T20 WC FINAL: ఎవరు గెలిచినా చరిత్రే

image

టీ20 వుమెన్స్ వరల్డ్ కప్‌లో రేపు దుబాయ్‌లో జరగబోయే ఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇంతవరకూ ఏ ఐసీసీ ట్రోఫీ సాధించలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా తొలిసారి ట్రోఫీ సాధించి హిస్టరీ క్రియేట్ చేయనున్నారు. కాగా పురుషుల విభాగంలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా ఎప్పుడూ ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీలు సాధించని విషయం తెలిసిందే.

News October 19, 2024

యుద్ధం ముగిసే వరకు బందీలను వదలం: హమాస్

image

యుద్ధానికి ముగింపు పలికే వరకు ఇజ్రాయెల్ బందీలను వదిలే ప్రసక్తే లేదని హమాస్ తేల్చి చెప్పింది. తమ ప్రాంతంపై దాడులు ఆపి, భద్రతా దళాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. పాలస్తీనా కోసం యాహ్యా సిన్వర్ చివరి వరకు పోరాడి, ప్రాణాలు అర్పించారని తెలిపింది. మరోవైపు హమాస్ తమ బందీలను వదిలి, ఆయుధాలను పక్కనబెట్టిన మరుక్షణమే యుద్ధం ముగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 19, 2024

ఈ భారత జట్టుకు పోరాడే లక్షణం ఎక్కువ: మంజ్రేకర్

image

బెంగళూరు టెస్టు విషయంలో న్యూజిలాండ్‌ను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించారు. భారత జట్టుపై గెలవడం అంత సులువు కాదని తేల్చిచెప్పారు. ‘ఇప్పుడున్న భారత జట్టుకు పోరాడే లక్షణం ఎక్కువ. నేను న్యూజిలాండ్ ఆటగాడినైతే కచ్చితంగా టీమ్ ఇండియాను చూసి భయపడతా. వరల్డ్ కప్ టీ20 ఫైనల్స్‌లో సౌతాఫ్రికాకు 30 బంతుల్లో 30 పరుగులే కావాలి. అయినా సరే భారత్ ఎలా గెలిచిందో చూశాం కదా’ అని ట్వీట్ చేశారు.