News October 19, 2024
టూత్‌పేస్ట్ కొన్నారని 24మంది ఉద్యోగుల తొలగింపు!

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా USలోని తమ శాఖ నుంచి 24మంది ఉద్యోగుల్ని తొలగించింది. సుమారు రూ.2100 విలువైన ఫుడ్ వోచర్లను వారు టూత్ పేస్ట్, డిటర్జెంట్ వంటి సరుకులు కొనడానికి వాడటమే ఆ నిర్ణయానికి కారణం. కొంతమంది ఉద్యోగులైతే తమ భోజనాన్ని ఇంటికి కూడా పార్సిల్ చేశారని మెటా గుర్తించింది. ఆ కూపన్లతో మొత్తంగా 4 లక్షల డాలర్ల లబ్ధి పొందారని తేలడంతో ఆ ఉద్యోగులందరినీ సంస్థ తొలగించినట్లు మెటా వర్గాలు తెలిపాయి.
Similar News
News March 14, 2025
చేప కొరికితే చేయి పోయింది!

ఒక్కోసారి చిన్నగాయాలు కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. కేరళలోని కన్నూర్‌కు చెందిన రాజేశ్ అనే రైతు గత నెల ఇంటి వద్ద చెరువును శుభ్రం చేస్తుండగా చేతి వేలిని ‘కడు’ జాతి చేప కొరికింది. చూస్తుండగానే అది ‘గ్యాస్ గాంగ్రీన్’ ఇన్ఫెక్షన్‌గా మారింది. దీంతో వైద్యులు అతడి కుడిచేతిని మోచేతి వరకు తీసేశారు. చేప నుంచి అతడి ఒంట్లో చేరిన క్లోస్ట్రిడియమ్ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.
News March 14, 2025
ఎలాన్ మస్క్ Starlinkకు కేంద్రం షరతులు!

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో జట్టుకట్టిన స్టార్‌లింకుకు కేంద్రం కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. దేశంలో ప్రవేశించాలంటే కచ్చితంగా కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. శాంతిభద్రతల నియంత్రణకు ఇది కీలకం. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి చేయిదాటినప్పుడు ఇంటర్నెట్‌ను నిలిపివేయాలంటే ప్రతిసారీ USలోని స్టార్‌లింక్ ఆఫీస్‌ను సంప్రదించడం కుదరదు. అందుకే షరతులు పెట్టింది.
News March 14, 2025
BREAKING: మసీదులో బాంబు బ్లాస్ట్

దాయాది పాకిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. సౌత్ వజీరిస్థాన్‌లోని అజామ్ వర్సాక్‌లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతుండగా ఓ మసీదులో బాంబు పేలింది. ఈ ఘటనలో JUI డిస్ట్రిక్ట్ చీఫ్ అబ్దుల్లా నదీమ్, మరొకరు గాయపడ్డారని సమాచారం. బాంబు పెట్టిందెవరు? ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియాల్సి ఉంది. రంజాన్ మాసం రెండో శుక్రవారం కావడంతో ప్రజలు భారీగా మసీదుకు వచ్చారని సమాచారం.