News October 19, 2024

గవర్నర్ ‘ద్రవిడియన్ అలర్జీ’తో బాధపడుతున్నారు: స్టాలిన్

image

TN గవర్నర్‌గా రవిని తొలగించాలని CM స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన ‘ద్రవిడియన్ అలర్జీ’తో బాధపడుతున్నారని విమర్శించారు. రవి ఇవాళ హిందీ భాష మాసోత్సవాలకు హాజరయ్యారు. అక్కడ రాష్ట్రగీతం ఆలపించిన బృందం ‘ద్రవిడ’ అనే పదాన్ని స్కిప్ చేసింది. దీంతో గవర్నర్‌పై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమిళులను అవమానించడమేనన్నారు. జాతీయ గీతం నుంచి కూడా ద్రవిడ పదం తీసేసే ధైర్యం చేస్తారా అని ప్రశ్నించారు.

Similar News

News October 19, 2024

నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్

image

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా ఇవాళ ఇండియా-A, పాకిస్థాన్-A తలపడనున్నాయి. ఒమన్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులను ఫ్యాన్‌ కోడ్ యాప్‌లో చూడొచ్చు. కాగా భారత-ఏ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తున్నారు. జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్, రమణ్‌దీప్, తిలక్ వర్మ(C), అనూజ్, హృతిక్ షోకీన్, సాయి కిషోర్, రాహుల్ చాహర్, రసిఖ్ దార్, వైభవ్, నిశాంత్.

News October 19, 2024

హైదరాబాద్‌లో మరో కొత్త జైలు?

image

TG: హైదరాబాద్‌లో మరో కొత్త జైలు ఏర్పాటు చేసేందుకు జైళ్ల శాఖ అధికారులు యోచిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీనిని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీలను చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండటంతో కిక్కిరిసిపోతోంది. 1250 మంది ఖైదీలను ఉంచాల్సిన జైల్లో ఒక్కోసారి 2,000 మందిని ఉంచుతున్నారు. ఆ జైలుపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News October 19, 2024

ఎమ్మెల్యేకు అర్ధరాత్రి మహిళ న్యూడ్ వీడియోకాల్

image

TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ MLAకు న్యూడ్ కాల్ రావడం కలకలం రేపింది. ఈనెల 14న అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని నంబర్ నుంచి వీడియోకాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే ఓ మహిళ నగ్నంగా కనిపించింది. ఆందోళనకు గురైన MLA వెంటనే కాల్ కట్ చేశారు. తనపై కుట్రకు ప్రత్యర్థులే అలా చేశారా? లేక గుర్తుతెలియని వ్యక్తులా? అని అనుమానం వ్యక్తం చేశారు. నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, TGCSBలో ఫిర్యాదు చేశారు.