News October 19, 2024

23న ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న మరోసారి సమావేశం కానుంది. క్యాబినెట్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 21న సాయంత్రం 4 గంటల్లోపు పంపించాలని అన్ని శాఖలను సీఎస్ నీరబ్‌కుమార్ ఆదేశించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాగా ఈ నెలలో ఇది మూడో క్యాబినెట్ భేటీ.

Similar News

News October 19, 2024

గాజాపై భీకర దాడి.. 33 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 33 మంది మరణించారు. వీరిలో 21 మంది మహిళలే ఉన్నారు. మరో 80 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 42,500 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. లక్ష మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

News October 19, 2024

ఢిల్లీకి కప్పం కట్టకపోతే చిట్టి పదవి మటాష్: కేటీఆర్

image

TG: హైడ్రా ఎఫెక్ట్‌తో GHMC పరిధిలో నిర్మాణాలకు బ్రేక్ పడిందని ఓ మీడియాలో వచ్చిన వార్తపై కేటీఆర్ స్పందించారు. ‘RR Tax కట్టాలి కదా? ఢిల్లీకి మన చిట్టి కప్పం కట్టకపోతే పదవి మటాష్ కదా! మనమే ఏరికోరి తెచ్చుకున్న మార్పు కదా’ అంటూ సీఎం రేవంత్‌పై Xలో సెటైర్లు వేశారు.

News October 19, 2024

విస్తారా విమానానికి బాంబు బెదిరింపు!

image

ఢిల్లీ నుంచి లండన్‌కు బయల్దేరిన విస్తారా విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించినట్లు తెలిపింది. విమానం ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. భద్రతా ఏజెన్సీలు క్లియర్ చేసిన తర్వాతే లండన్‌కు బయల్దేరుతుందని తెలిపింది.