News October 19, 2024

హమాస్ చీఫ్ సిన్వర్ స్థానం దక్కేదెవరికో?

image

హమాస్ గ్రూప్ అధినేత యాహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. దీంతో హమాస్‌ను ఎవరు ముందుకు నడిపిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరు మహ్మద్ అల్ జహర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ తర్వాతి వరుసలో సిన్వర్ సోదరుడు మహ్మద్ సిన్వర్, హమాస్ మిలటరీ వింగ్ కమాండర్ మహ్మద్ దీఫ్, హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యులు మౌసా అబు మార్జౌక్, ఖలీల్ అల్ హయ్యా, ఖలేద్ మెషాల్ ఉన్నారు.

Similar News

News October 19, 2024

యువతి MBBS చదువుకు కేటీఆర్ భరోసా

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచి మనసు చాటుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన నిరుపేద దళిత యువతి సుస్మిత MBBS చదువుకు భరోసానిచ్చారు. ఆమె కల్వకుర్తి గురుకులంలో చదివి, ఉస్మానియా కాలేజీలో MBSS సీటు సాధించి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా ఆయన స్పందించారు. తాను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు.

News October 19, 2024

తక్కువ ధరలకే వంటనూనెలు: మంత్రి నాదెండ్ల

image

AP: రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరలకే వంట నూనెలను అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామాయిల్ లీటర్ రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.124కే ఇస్తామని చెప్పారు. అలాగే తక్కువ ధరకే కందిపప్పు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విజయవాడలో వంటనూనెల దిగుమతిదారులతో మంత్రి భేటీ అయ్యారు. మరింత ఎక్కువగా వంటనూనెలను అందుబాటులో ఉంచాలని వారిని ఆదేశించారు.

News October 19, 2024

కేటీఆర్‌ను కలిసిన గ్రూప్-4 అభ్యర్థులు

image

TG: గ్రూప్-4 ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి దాదాపు 2 నెలలు కావొస్తున్నా ఇంకా తుది జాబితాను ప్రకటించకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై తమకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను కలిశారు. ఎలాంటి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా భర్తీ చేసేలా ప్రభుత్వం‌పై ఒత్తిడి తేవాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన KTR దీని‌పై ఉద్యమిస్తామని వారికి హామీ ఇచ్చారు.