News October 19, 2024
IND vs NZ: ఈ రోజు 400 కొడితేనే..!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేసినా రెండో ఇన్నింగ్స్‌లో గొప్పగానే పుంజుకుంది. ఇదే నిలకడ ఈ రోజు మొత్తం కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది. పంత్, కేఎల్, సర్ఫ్రాజ్ కీలకంగా మారనున్నారు. కనీసం 300 నుంచి 400 పరుగులు చేస్తేనే ప్రత్యర్థిపై పోరాడే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేస్తే కనీసం మ్యాచ్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ పరుగులకే భారత్ చాప చుట్టేస్తే ఓటమి ఖాయం.
Similar News
News January 3, 2025
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు వీరే
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎన్నికల ఇన్చార్జుల్ని నియమించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక బీజేపీ నేత పీసీ మోహన్ పేర్లను ప్రకటించింది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని తమిళనాడుకు రిటర్నింగ్ అధికారిగా నియమించింది. బీజేపీ నిబంధనల ప్రకారం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
News January 3, 2025
BGT: నేటి టెస్టు టైమింగ్స్ ఇవే
నేడు సిడ్నీలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల టోర్నీలో 2-1తో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. దీంతో సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే భారత్ చివరి టెస్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఉదయం 4.30 గంటలకు టాస్ వేస్తారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు తొలి సెషన్, 7.40 నుంచి 9.40 వరకు రెండో సెషన్, 10 నుంచి 12 గంటల వరకు ఆఖరి సెషన్ ఉంటుంది.
News January 3, 2025
అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ?
ఖలిస్థానీ వేర్పాటువాది, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న పంజాబ్‌లోని శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అజ్నాలా పీఎస్‌పై దాడి కేసులో అరెస్టైన అమృత్ పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. గత ఎన్నికల్లో జైలు నుంచే ఆయన పోటీ చేసి ఖడూర్ సాహిబ్ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.