News October 19, 2024

గ్రూప్-1 మెయిన్స్ రద్దు పిటిషన్‌పై ఘాటుగా స్పందించిన HC

image

TG: గ్రూప్-1 మెయిన్స్ రద్దు కుదరదని తీర్పిచ్చిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నోటిఫికేషన్ జారీనే చట్టవిరుద్ధమన్నప్పుడు ప్రిలిమ్స్ రాయకముందు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు. ఇప్పటికే రెండుసార్లు రద్దయ్యాయి. మొదటిసారి 5 లక్షల మంది రాస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3 లక్షలకు వచ్చింది. మళ్లీ రద్దంటే కుదరదు. ఇంకా ఎన్నేళ్లు ఇలా? వీటిని అనుమతిస్తే కొత్త అభ్యంతరాలతో మరికొందరు వస్తారు’ అని ఘాటుగా స్పందించింది.

Similar News

News February 1, 2026

పోలవరానికి తగ్గిన నిధుల కేటాయింపు

image

AP: FY26-27 కేంద్ర బ‌డ్జెట్‌లో పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈసారి ఈ ప్రాజెక్టుకు ₹3320 కోట్లు మాత్రమే కేటాయించారు. గ‌త ఏడాది బ‌డ్జెట్‌లో ₹5936 కోట్లు ఇచ్చారు. అయితే గత ఏడాది ఎక్కువ నిధులు కేటాయించినా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ₹3017 కోట్లు మాత్రమే వచ్చాయి. పోల‌వ‌రం వాట‌ర్ స్టోరేజి లెవ‌ల్‌ను 41.15 మీట‌ర్ల‌కు కుదించిన‌ట్లు కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.

News February 1, 2026

ఫోన్లు ట్యాప్ చేసి ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేశారు: TPCC చీఫ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR సిట్ విచారణ నేపథ్యంలో BRSపై TPCC చీఫ్ మహేశ్ గౌడ్ ఘాటుగా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, గతంలో అనేకమంది CMలు విచారణ ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ట్యాపింగ్‌ను అడ్డం పెట్టుకొని బిల్డర్లు, సినీ ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేశారని, వందలాది మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూశారని ఆరోపించారు. KCR ఆదేశాలు లేకుండా ఇంతపెద్ద ఎత్తున ట్యాపింగ్ జరగడం సాధ్యం కాదన్నారు.

News February 1, 2026

Apocalypto యాక్టర్ కన్నుమూత

image

ప్రముఖ మెక్సికన్ యాక్టర్ గెరార్డో తరసేనా(55) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. Apocalypto, మ్యాన్ ఆన్ ఫైర్, ది మెక్సికన్ సినిమాలు, నార్కోస్ వెబ్ సిరీస్ ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కెరీర్‌లో దాదాపు 50 చిత్రాలు, టీవీ సిరీస్‌లలో నటించారు.