News October 19, 2024
నందిగామ: పెదకాకాని రావాలని ఫోన్.. ఇంతలోనే సూసైడ్

నందిగామ మండలానికి చెందిన శైలజ, పెదకాకానికి చెందిన మహేశ్ శుక్రవారం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. శైలజ ఇటీవల గుంటూరులోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, మహేశ్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నిన్న తల్లికి ఫోన్ చేసి పెదకాకాని రావాలని చెప్పిన శైలజ.. అంతలోనే తనువు చాలించింది. రెండేళ్ల కిందటే హైదరాబాద్‌లో వీరు ప్రేమించుకోగా, పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని సూసైడ్ చేసుకున్నారు.
Similar News
News November 6, 2025
మచిలీపట్నం: ఎన్నికల చట్టాలు, నిబంధనలపై వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రంలోని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనలపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. అవనిగడ్డ, పామర్రు, పెడన, గన్నవరం నియోజకవర్గాల రెవెన్యూ శాఖేతర అధికారులుగా డీఎస్‌వో, డీఎం పౌరసరఫరాల సంస్థ, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ముడా వీసీలు ఓటర్ల నమోదు అధికారులుగా ఉంటారన్నారు.
News November 6, 2025
కృష్ణా: ఇకపై విజన్ యూనిట్‌లుగా సచివాలయాలు

గ్రామ/వార్డు సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్‌లుగా మారనున్నాయి. సచివాలయాల పేర్లు మారుస్తున్నట్లు గురువారం జరిగిన మంత్రులు, HODలు, సెక్రటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జిల్లాలో 508 సచివాలయాలు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ విజన్ యూనిట్‌లుగా పని చేయనున్నాయి.
News November 6, 2025
మాక్ అసెంబ్లీకి కృష్ణా జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థుల ఎంపిక

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం 7 నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తెలిపారు. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సభా వ్యవహారాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని DEO వివరించారు.


