News October 19, 2024

కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు బ్రేక్?

image

APలో కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుకు అడ్డంకులు ఎదురువుతున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపుల విభజన ప్రక్రియ సరిగ్గా జరగడం లేదంటూ కొందరు డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 35 ప్రకారం రేషనలైజేషన్ ప్ర్రక్రియను కొనసాగించడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో షాపుల విభజనను నిలిపేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొత్తగా 2,774 షాపులు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.

Similar News

News October 19, 2024

మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటా: KTR

image

TG: మూసీ పరీవాహకంలో ఉండాలన్న సీఎం రేవంత్ <<14382694>>సవాల్‌ను<<>> బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్వీకరించారు. మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని స్పష్టం చేశారు. తాను గతంలో మూసీ నింబోలి అడ్డాలోనే ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ పెద్దలకు డబ్బులు పంపాలంటే చందాలు వేసుకుని ఇస్తామని వ్యంగ్యంగా మాట్లాడారు. మూసీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

News October 19, 2024

తిరుపతిలో ‘బడి వైన్స్’.. నెటిజన్ల ట్రోల్స్

image

AP: నూతన మద్యం విధానంలో భాగంగా ఇటీవల తిరుపతిలో ప్రారంభమైన ఓ ప్రైవేటు మద్యం షాపు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దాని పేరు ‘బడి వైన్స్’ అని ఉండటమే దీనికి కారణం. నాన్నలకూ ఓ బడి తెరిచారని, అక్కడ ‘మందు’ చదువులు చెబుతారేమో అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆ పేరు ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదని, ఆ షాపు యజమాని ఇంటి పేరే అదని పలువురు పేర్కొంటున్నారు.

News October 19, 2024

వారికి డిసెంబర్‌లోగా రుణమాఫీ: మంత్రి తుమ్మల

image

TG: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే దఫాలో రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. CM ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మీడియా సమావేశంలో చెప్పారు. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని, CM సూచనలతో రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామన్నారు. కుటుంబ నిర్ధారణ జరిగి వైట్ రేషన్ కార్డు లేని 3 లక్షల ఖాతాలకు డిసెంబర్‌లోగా మాఫీ చేస్తామని పేర్కొన్నారు.