News October 19, 2024

విస్తారా విమానానికి బాంబు బెదిరింపు!

image

ఢిల్లీ నుంచి లండన్‌కు బయల్దేరిన విస్తారా విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించినట్లు తెలిపింది. విమానం ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. భద్రతా ఏజెన్సీలు క్లియర్ చేసిన తర్వాతే లండన్‌కు బయల్దేరుతుందని తెలిపింది.

Similar News

News October 19, 2024

ఎకరాకు రూ.7,500.. ఎప్పటినుంచంటే?

image

TG: పంట ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రబీ నుంచి పంట బీమాకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన MSPకే పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీని ఆధారంగా రబీ సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు. పంట వేసిన వారికే డబ్బులు చెల్లించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు.

News October 19, 2024

అయ్యర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా ముంబై

image

రంజీ ట్రోఫీలో మహారాష్ట్రతో జరుగుతున్న టెస్టులో ముంబై తొలి ఇన్నింగ్సులో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ అయుష్(176), శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 200 పరుగులకు పైగా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్సులో మహారాష్ట్ర 126 పరుగులకే ఆలౌటైంది. కాగా శ్రేయస్‌కు ఇది 14వ ఫస్ట్ క్లాస్ సెంచరీ.

News October 19, 2024

గ్రూప్-1 అభ్యర్థుల నిరసనపై రాహుల్ స్పందించాలి: హరీశ్

image

TG: ఎన్నికల ముందు అశోక్‌నగర్‌లో తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు వారికి వినిపించడం లేదా? రాహుల్ గాంధీ తప్పకుండా స్పందించాలి. అందరికీ న్యాయం చేయాలని KCR తెచ్చిన GO 55ను ఎందుకు రద్దు చేశారు? GO 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.