News October 19, 2024
పీసీసీ అధ్యక్షులు రేవంత్ ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారు: కొప్పుల

ఉద్యోగాల నియామకాల విషయంలో పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం, మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వమే ఆ నోటిఫికేషన్లను విడుదల చేసిందన్నారు.
Similar News
News July 6, 2025
KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి KNR 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నెల 8న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తదుపరి రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం 10న అరుణాచలం నుంచి మధ్యాహ్నం బయలుదేరుతుందన్నారు. మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 11వ తేదీ సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు.
News July 6, 2025
కరీంనగర్: ఈ నెల 13లోగా అప్లై చేయాలి

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13లోగా http://nationalawardstoteachers.education.gov.in వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
News July 6, 2025
KNR: ‘జూనియర్ కళాశాలల్లో నమోదు పెంచాలి’

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.