News October 19, 2024

మహారాష్ట్ర ఎన్నికలు: FB, X, INSTAకు నోటీసులు

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లను తికమకపెట్టేలా ఉన్న 1752 ఫేక్‌న్యూస్ పోస్టులను తొలగించాలని ఆదేశించామంది. ఇప్పటి వరకు FB 16, INSTA 28, X 251, YT 5 పోస్టులను డిలీట్ చేసినట్టు వెల్లడించింది. కోడ్ ఉల్లంఘనపై c-VIGIL యాప్ ద్వారా 420 ఫిర్యాదులు రాగా 414 పరిష్కరించామని తెలిపింది. రూ.10.64కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, లిక్కర్ సీజ్ చేశామంది.

Similar News

News February 15, 2026

శివుడి చేతిలో ఢమరుకం ఎందుకు ఉంటుంది?

image

ఢమరుకనాదం విశ్వ సృష్టికి మూలం. ఇది ఓంకారనాదానికి ప్రతీక. దీన్నుంచే శబ్దశాస్త్రం, వ్యాకరణం ఉద్భవించాయని పురాణాలు వాక్కు. ఢమరుకంలోని 2 భాగాలు పురుష, ప్రకృతి శక్తుల కలయికను సూచిస్తాయి. ఇవి విశ్వాసం, చైతన్యానికి సంకేతం. మనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని ఈ ధ్వని మేల్కొల్పుతుంది. లయబద్ధమైన ఈ శబ్దం సృష్టి, స్థితి, లయల నిరంతర ప్రక్రియను ప్రతిబింబిస్తూ మనలో భక్తి, సానుకూల భావాన్ని నింపుతుంది.

News February 15, 2026

పండ్ల తోటల్లో పిందె/కాయలు రాలకుండా ఉండాలంటే?

image

పిందె, కాయలు ఎదిగే దశల్లో, పోషక లోపాల నివారణ కోసం, సూక్ష్మ, స్థూల పోషకాలను అందించాలి. కాయ ఎదుగుతున్న దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పండ్ల తోటలను ఆశించే పురుగులు, తెగుళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నివారణ చర్యలను పాటించాలి. అధిక సంఖ్యలో పిందెలు ఏర్పడితే బలహీనమైన, తక్కువ పరిమాణంలో ఉన్న పిందెలను తీసేస్తే పోషకాలు సమానంగా అంది రాలడం తగ్గుతుంది. పండు ఈగ కట్టడికి మిథైల్ యూజినాల్ ఎర వాడాలి.

News February 15, 2026

రెండేళ్లలో 40% నుంచి 6%కి ఓలా మార్కెట్ షేర్

image

ఒకప్పుడు దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. 2024 జనవరిలో 40%కి దగ్గరగా ఉన్న మార్కెట్ షేర్.. 2026 జనవరి నాటికి 6% కంటే తక్కువకు పడిపోయింది. సర్వీస్ నాణ్యత లోపాలు, పెరుగుతున్న కస్టమర్ కంప్లైంట్స్, ఇతర కంపెనీల నుంచి పోటీతో ఓలా ఐదో స్థానానికి పడిపోయింది. డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం రూ.470 కోట్లకు పడిపోయింది.